NRI-NRT

దుబాయిలో తెలుగు అసోసియేషన్ రక్తదాన కార్యక్రమం

దుబాయిలో తెలుగు అసోసియేషన్ రక్తదాన కార్యక్రమం

తెలుగు అసోసియేషన్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫ్ దుబాయి వారి అనుమతితో ప్రారంభించబడిన లాభాపేక్షలేని సంస్ఠ) దుబాయిలో 2022 జనవరి 21వ తేదీన రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రక్తదానం చేయటానికి ముందుకు వచ్చి ఈ బృహత్కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంస్థ చైర్మన్ ఉగ్గిన దినేష్ కుమార్ మాట్లాడుతూ.. “యూఏఈలోని పజ్రల చెంతకు చేరి, వారిలో మమేకమవడమే తమ లక్ష్యం అన్నారు. సామాజిక సేవలో తమ ప్రయత్నాలను నిరంతరం మెరుగుపరుస్తాము” అని తెలియజేసారు. బర్-దుబాయిలో నిర్వహించబడిన ఈ కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది. దుబాయ్ హెల్త్ అథారిటీ(డీహెచ్ఏ) వారి సిబ్బంది సమక్షంలో కోవిడ్‌కి సంబంధించిన అన్ని భదత్రా నియమాలను పాటిస్తూ, సంచార చికిత్స వాహనములో (మొబైల్ క్లినిక్) కార్యక్రమాన్ని నిర్వహించారు. బలుస వివేకానంద్(పధ్రాన కార్యదర్శి), వూట్నురి రవి (సామాజిక సేవా విభాగ సంచాలకులు) సంస్థ సభ్యులందరినీ సమన్వయ పరచడంలో కృషి చేశారు. వ్యవస్ఠాపక సభ్యు లైన చింతకాయల రాజీవ్, ఎండూరి శ్రీనివాస్ సబ్ కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమములో పాల్గొని రక్తదానం చేశారు.