WorldWonders

సైనికులకు ‘చక్ర ‘ పురస్కారమే ఎందుకు?

సైనికులకు ‘చక్ర ‘ పురస్కారమే ఎందుకు?

దేశ సార్వభౌమాధికారాన్ని.. సరిహద్దుల్ని.. సర్వసత్తాక స్వాతంత్య్రాన్ని.. శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే సైనికుల సేవలు నిరుపమానమైనవి! ఎండనక.. వాననక.. ఆసేతు హిమాచలం నిరంతరం రెప్పార్పకుండా దేశాన్ని కాపాడే ఆ ధీరోదాత్తుల సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఏటా రెండు సందర్భాల్లో పురస్కారాలు అందిస్తోంది. ఈ పురస్కారాలను జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రకటిస్తుంటారు.  
** ఇలా ఏటా రక్షణ దళాలకు చెందిన యోధులకు అందించే ఈ వివిధ స్థాయి పురస్కారాలు. వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..వీరులకు ఇచ్చే పురస్కారాల.

*పరమ్‌వీర చక్ర: 
ఇది దేశ సైన్యానికి అందించే అత్యున్నత పురస్కారం! గతంలో యుద్ధ వీరులకు ఆంగ్లేయుల పాలనలో అందించిన ‘విక్టోరియా క్రాస్‌’కు సమానంగా స్వాతంత్య్రానంతరం యుద్ధ సమయంలో శత్రువుల్ని తుదముట్టించడంలో అత్యున్నత శక్తిసామర్థ్యాలు.. సాహసం.. సహచరుల్ని కాపాడుకోవడంలో సమయస్ఫూర్తి చూపిన అత్యుత్తమ వీరయోధుడికి ఈ ‘పరమ్‌వీర చక్ర’ పురస్కారం అలంకరిస్తారు. త్రివిధ దళాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాల్లో ఏ విభాగం వారికైనా దీన్ని ప్రదానం చేయవచ్చు.

*మహావీర చక్ర: 
ఇది రెండో అత్యున్నత మిలటరీ పురస్కారం. శత్రువులను ఎదుర్కొనేటప్పుడు చూపే అత్యున్నత ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి.. పరాక్రమాల ఆధారంగా ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు.

*వీర చక్ర: 
యుద్ధ సమయాల్లో ప్రదర్శించే ధైర్యసాహసాలు.. తెగువ లక్షణాల ఆధారంగా ఇచ్చే మూడో అత్యున్నత సైనిక పురస్కారం ఇది.\శాంతిభద్రతల రక్షణకు సంబంధించిన పురస్కారాలు.

*అశోక్‌చక్ర పురస్కారం:
దీన్ని భారత మిలటరీ దళాలకు సంబంధించి ఇచ్చే ‘పరమ్‌వీర చక్ర’తో సమానమైన అత్యున్నత పురస్కారంగా భావిస్తారు! శత్రువుల్ని ఎదుర్కొనే క్రమంలో చూపిన అసమాన ధైర్యసాహసాలు.. దేశభక్తి.. త్యాగనిరతి లాంటి అత్యున్నత యోగ్యతల ఆధారంగా దీన్ని ప్రదానం చేస్తారు.

!* కీర్తిచక్ర పురస్కారం:
శాంతిభద్రతలకు సంబంధించి రెండో అత్యున్నత పురస్కారంగా ‘కీర్తిచక్ర’ను భావిస్తారు.

* శౌర్యచక్ర పురస్కారం:
 మొదట్లో పరమ్‌వీర్‌గా పిలిచే ఈ పురస్కారాన్ని తర్వాత శౌర్యచక్రగా మార్చి.. తృతీయ స్థాయి అత్యున్నత పురస్కారంగా అందిస్తున్నారు.ఇక సేనా మెడల్‌ నుంచి.. నౌసేనా మెడల్‌.. వాయు సేనా మెడల్‌.. సర్వోత్తమ్‌ యుద్ధ్‌సేవా మెడల్‌ ఉత్తమ్‌ యుద్ధ్‌సేవా మెడల్‌.. యుద్ధ్‌ సేవా మెడల్‌ తదితర పురస్కారాలూ.. ఆయా సందర్భాల్లో వ్యక్తిగతంగా సైనికులు ప్రదర్శించే సాహసం.. దేశభక్తి.. ఆత్మబలిదానం లాంటి అత్యుత్తమ యోగ్యతల ఆధారంగా ప్రదానం చేస్తుంటారు.