Business

మిలియనీర్లను పుట్టి ముచుతున్న బిట్ కాయిన్ – TNI – నేటి వాణిజ్య వార్తలు – 27/01/2022

మిలియనీర్లను పుట్టి ముచుతున్న బిట్ కాయిన్ –  TNI – నేటి వాణిజ్య వార్తలు – 27/01/2022

* సుమారు 30 వేలమంది బిట్కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్‌కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది.అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్కాయిన్ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్కాయిన్ చేస్తున్న డ్యామేజ్ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!.

* గత ఏడాది రికార్డు సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వాటిలో చాలా కంపెనీల ఇష్యూలతోపాటు స్టాక్‌ మార్కెట్లో వాటి షేర్ల లిస్టింగ్‌కూ ఇన్వెస్టర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈక్విటీ మార్కెట్ల జోరు, రిటైల్‌ మదుపరుల ఆసక్తి పెరగడం ఇందుకు దోహదపడింది. అయితే, ఈ ఏడాది మార్కెట్లు బేర్‌ మలుపు తీసుకున్నాయి.

* ఈ ఏడాది మార్చి నుంచి వడ్డీరేట్ల పెంపు తప్పదని అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్‌ రిజర్వు’ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. బుధవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటు 0.25 శాతం మేర పెరుగుతుందని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

* టెక్నాలజీ కంపెనీ స్మాట్రాన్‌ గ్రూప్‌.. గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ గ్రూప్‌ (జీఈఎం) నుంచి రూ.1,495.80 కోట్ల (20 కోట్ల డాలర్లు) నిధులను అందుకుంది. జీఎఈం.. షేర్‌ సబ్‌స్ర్కిప్షన్‌ విధానంలో స్మాట్రాన్‌లో ఈ పెట్టుబడులు పెడుతోంది. మహేశ్‌ లింగారెడ్డి ఏర్పాటు చేసిన స్మాట్రాన్‌.. తన సొంత ఏఐఓటీ ప్లాట్‌ఫామ్‌.. ట్రాన్‌ఎక్స్‌ ద్వారా హోమ్‌, మొబిలిటీ, ఆరోగ్య విభాగాల కోసం స్మార్ట్‌, ఇంటలిజెంట్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది.

* మెడికల్‌ రెస్పాన్స్‌ కంపెనీ స్టాన్‌ ప్ల్‌ స.. సిరీస్‌ ఏ ఇన్వె్‌స్టమెంట్‌ రూపంలో 2 కోట్ల డాలర్ల (రూ.150 కోట్లు) నిధులను సమీకరించింది. హెల్త్‌క్వాడ్‌, కలారీ క్యాపిటల్‌ సహా మరికొందరి నుంచి ఈ మొత్తాలను సమీకరించింది. ఈ నిధులతో స్టాన్‌ప్ల్‌ స కార్యకలాపాలు 500 హాస్పిటల్స్‌ కు విస్తరించటంతో పాటు రెడ్‌ అంబులెన్స్‌ బ్రాండ్‌ సేవలను ప్రస్తుతమున్న 5 నగరాల నుంచి 15 నగరాలకు పెంచనుంది.

* అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌.. ప్రస్తుత ఇన్వెస్టర్లతో పాటు 3లైన్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌, సీ4డీ ఏషియా ఫండ్‌ నుంచి రూ.45 కోట్ల నిధు లు (60 లక్షల డాలర్లు) సమీకరించినట్లు వెల్లడించింది. ఇన్నోవేటివ్‌, డీసెంట్రలైజ్డ్‌ మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను అవర్‌ ఫుడ్‌ నిర్వహిస్తోంది. కార్యకలాపాల విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఆహారోత్పత్తుల సప్లయ్‌ చెయిన్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు అవ ర్‌ ఫుడ్‌ సీఈఓ బాలా రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.