Politics

ఎంపీ ధర్మపురి కి గవర్నర్ పరామర్శ

ఎంపీ ధర్మపురి కి గవర్నర్ పరామర్శ

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి వివరాలతో పాటు నిజామాబాద్ సీపీ, పోలీస్ లు తీరును ఎంపీ ఆమెకు వివరించారు. పోలీసుల పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని.. ముందస్తు సమాచారం ఇచ్చినా రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదని అర్వింద్ గవర్నర్ కు తెలియజేసారు. సొంత నియోజకవర్గంలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని పార్లమెంట్ సభ్యులు.. ప్రజాప్రతినిధులపై పోలీసుల సమక్షంలోనే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందని ఎంపీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు.