Devotional

ఆచార్య చాణక్య తెలిపిన ఈ 10 అమూల్య విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోండి. 

ఆచార్య చాణక్య తెలిపిన ఈ 10 అమూల్య విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోండి. 

1. ఆవుల మందలో ప్రవేశించిన దూడ తన తల్లిని ఎలా అనుసరిస్తుందో, అదే విధంగా ఒక వ్యక్తి చేసే మంచి, చెడు కర్మలు అతనిని అనుసరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి పనులు చేస్తుండాలి.
2. తెలివిగల మనిషి తన ఇంద్రియాల అదుపు విషయంలో కొంగలా ప్రవర్తించి, స్థలం, సమయం, తన సామర్థ్యాలను అర్థం చేసుకుని తన పనితనాన్ని నిరూపించుకోవాలి.
3. కష్టపడి పనిచేసేవారిని చూస్తే పేదరికం పారిపోతుంది. ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించే వారు పాపపు పనులు చేయలేరు. ఇటువంటి మనసు కలిగినవారు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటారు.
4. రాజు యొక్క బలం అతని శక్తివంతమైన బాహువులలో ఉంటుంది. బ్రాహ్మణుని బలం అతని ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉంటుంది. స్త్రీ యొక్క బలం ఆమె అందం, యవ్వనం, మధురమైన మాటలలో ఉంటుంది.
5. మీరు త్వరగా విజయం సాధించాలనుకుంటే, మీరు నైపుణ్యం సంపాదించిన పనిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండండి.
6. ఐశ్వర్యం, స్నేహితులు, భార్య, రాజ్యం తిరిగి పొందవచ్చు. కానీ ఈ శరీరాన్ని తిరిగి పొందలేము. కాబట్టి కాలాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోండి.
7మనం ఎవరి ద్వారానైతే ఏదైనా పని పూర్తిచేయించాలనుకుంటున్నామో.. వారు ఇష్టపడే రీతిలో మాట్లాడాలి. 
8. తన కుటుంబంతో విపరీతమైన అనుబంధం కలిగిన వ్యక్తిని భయం, దుఃఖం వెంటాడుతుంటాయి. అన్ని బాధలకు అనుబంధమే ప్రధాన కారణం. అందుకే సంతోషంగా ఉండాలంటే పరిధికి మించిన అనుబంధాలను వదులుకోవడం అవసరం.
9. బంగారంతో పూత వేస్తే వెండి కూడా బంగారంలానే కనిపిస్తుంది. సత్సంగం ప్రభావం ఖచ్చితంగా మానవులపై పడుతుందని దీని అర్థం.
10. పనులు చేపట్టాక ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే మూర్ఖులు తప్పులు కనుగొంటారు. తెలివైన వ్యక్తి పని ప్రారంభించే ముందే ప్రణాళికతో ఉంటాడు.