Health

భారత్ లో కరోనా కొత్తగా 2,51,209 కేసులు నమోదు..

భారత్ లో కరోనా కొత్తగా 2,51,209  కేసులు నమోదు..

భారత్ లో కరోనా మూడో దశ తీవ్రత తగ్గుతుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2,51,209 కరోనా కేసులు నమోదు అయ్యాయి.ఈమేరకు శుక్రవారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. అయితే అంతక ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. దీంతో రోజువారీ పాజిటివిటీ 15.88%శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 17.47% శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 627 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,05,611 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల మధ్య 3,47,443 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,80,24,771కు చేరింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 15,82,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 72.37 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా 164.44 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. జనవరి రెండు, మూడు వారాల్లో భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉండగా.. నాలుగో వారం ప్రారంభం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కొత్త కేసుల్లో అత్యధికశాతం “ఓమిక్రాన్ BA 2” బాధితులే ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది.