Devotional

ప్రాచీన కట్టడాల నిర్మాణానికి డంగు సున్నం

ప్రాచీన కట్టడాల నిర్మాణానికి డంగు సున్నం

రాజులు కట్టిన కోటలు , ప్రాచీన కాలంలో నిర్మించిన అద్భుతమైన ఆలయాలు వేల ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నాయి . అందుకు కారణం బండరాళ్లే కాదు .. బండరాళ్లే కాదు .. దృఢమైన ఆ రాళ్లు శతాబ్దాల తరబడి విడిపోకుండా అతుక్కుని ఉండేందుకు దోహదపడిన డంగు సున్నం కూడా . దీని స్థానంలో సిమెంటు వచ్చినా జీవితకాలం వందేళ్లలోపే . అందుకే ప్రాచీన ఆలయాల పునర్నిర్మాణంలో మన పూర్వీకులు చేసిన విధానంలోనే డంగు సున్నాన్ని ఇప్పుడు ఓపిగ్గా తయారుచేస్తూ ప్రాచీన వైభవానికి సొబగులు అద్దుతున్నారు .
* యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రహరీ నిర్మాణానికి డంగు సున్నామే వినియోగించారు . కేంద్ర పురావస్తు శాఖ పునర్నిర్మాణం చేపడుతున్న వరంగల్ కోట కట్టడాలు , రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ నిర్మాణం , జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కోట పునర్నిర్మాణం కోసం కూడా దీన్ని నిర్మాణ ప్రాంతాల్లోనే తయారుచేస్తూ కట్టడాలకు ప్రాణం పోస్తున్నారు .

*ప్రాచీన కాలం తరహాలోనే  డంగు సున్నాన్ని ఇప్పటికీ పాత కాలం నాటి పద్ధతిలోనే తయారుచేస్తున్నారు . అప్పుడు ఎడ్లను ఉపయోగిస్తే ఇప్పుడు చిన్నపాటి యంత్రాలను వాడుతున్నారు . ప్రస్తుతం ఖిలాషాపూర్ కోటకు కావాల్సిన డంగు సున్నం తయారీకి కరక్కాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నుంచి తెప్పించారు . యాదాద్రి ఆలయాన్ని కట్టిన శిల్పులే ఈ కోటను నిర్మిస్తున్నారు .
* సులువుగా చేసేందుకు మరిన్ని పరిశోధనలు వరంగల్ ఎస్ఐటీలో గతేడాది ‘ డంగు సున్నం ‘పునఃసృష్టించారు . సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆచార్య రతీశ్కుమార్ , పరిశోధక విద్యార్థి నిఖిల్ కుమార్తో కలిపి ప్రయోగశాలలో తయారుచేశారు . లైమ్ మోర్టార్గా పేరు పెట్టారు . రామప్ప ఆలయ నిర్మాణంలో డంగు సున్నాన్ని వాడడం వల్లే చెక్కు చెదరకుండా ఉందని తేల్చారు . వీరి పరిశోధన ‘ జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్’లో ప్రచురితమైంది . కాలం గడిచే కొద్దీ డంగు సున్నం మరింత దృఢమవుతుంద ^ అయోధ్య రామాలయం నిర్మాణంలో సిమెంటు బ్లాకులకు బదులు రాళ్లను అతికించేందుకు డంగు సున్నం వాడాలని ఆలయ కమిటీకి తెలియజేశామని విశ్రాంత జియో ఇంజినీరు , కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ఆచార్య పాండురంగారావు తెలిపారు .