Politics

మహారాష్ట్ర 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసిన

మహారాష్ట్ర 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసిన

మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎమ్మెల్యేలపై స్పీకర్‌ విధించిన ఏడాది సస్పెన్షన్‌ రాజ్యాంగ విరుద్దమని, చట్ట వ్యతిరేకమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ నిర్ణయం తన అధికార పరిధిని మించి ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్యానించింది. అంతేగాక సస్పెన్షన్.. సెషన్ మేర లేదా ఆరు నెలలలోపే ఉండాలని గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి ప్రస్తావించింది. కాగా గత జూలై మహారాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారంటూ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. బీసీ కోటాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలుపుతూ.. స్పీకర్‌ని దూషించడమే కాక కొట్టారనే ఆరోపణలపై ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.