DailyDose

TNI నేర వార్తలు 30/1/2022

TNI  నేర వార్తలు 30/1/2022

*రాజస్తాన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల ప్రకారం.. జైపూర్లోని జామ్వా రామ్గఢ్ ప్రాంతంలో ఉన్న టర్పెంటైన్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

*చిత్తూరు జిల్లాలో జల్లికట్టు వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా జల్లికట్టు ఎద్దులను ముస్తాబు చేశారు. వెదురుకుప్పం మండలం చిన్నపోటులో జల్లికట్టు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకల్లో పరిగెడుతూ ఎద్దు అదుపుతప్పింది. దీంతో ఎద్దు బావిలో పడి మృతి చెందింది. ఎద్దులను నివారించేందుకు యువత ఎగబడ్డారు. కోడె గిత్తలను నిలువరించి, వాటి కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. జల్లికట్టు చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

* కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టిన కారు వీధి వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు ప్రమాద నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కారును 16 ఏళ్ల మైనర్ నడపటం వల్లే ప్రమాదం జరిగిందని కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు మైనర్లున్నారని తెలిపారు. తండ్రి రాజేంద్రప్రసాద్ కొడుకుకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని సీపీ చెప్పారు.

* వైసీపీ వేధింపులకు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే అక్కసుతో అధికారులను ఉసుగొల్పి మహిళకు చెందిన రేకుల షెడ్డును తొలగించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ పురుగుల మందు తాగింది. పశ్చిమ గోదావరి జిల్లా, ఉంగుటూరు మండలం, తల్లాపురంలో అధికార పార్టీకి చెందిన పైడిముక్కల రామకృష్ణ ఎమ్మెల్యే అండతో తనకు ఓటు వేయలేదని రేకుల షెడ్డును కూల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలి కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది.

* జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. కశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో జైషే మహమ్మద్‌ కమాండర్‌ జహీద్‌ వాని కూడా ఉన్నాడని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మిగతా నలుగురు లష్కరే తొయిబాకు చెందిన వారిగా గుర్తించామన్నారు.

* తండ్రి మందలించాడన్న మనస్తాపంతో పురుగు మందు తాగిన నవ వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని కోనాం శివారు గిరిజన గ్రామం గుంటిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ సుధాకరరావు కథనం మేరకు వివరాలిలావున్నాయి. గుంటి గ్రామానికి చెందిన కాదలి రాజుకు పక్క గ్రామమైన గుంటి కొత్తూరుకు చెందిన గర్శింగి అచ్చిబాబు కుమార్తె దేవి (18)కి మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఇటీవలకాలంలో ప్రతిరోజు దేవి తండ్రి అచ్చిబాబు అల్లుడి స్వగ్రామమైన గుంటి వచ్చి సారా సేవించి వెళ్తుండేవాడని ఎస్‌ఐ తెలిపారు.

* ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి భారీ గా డ్రగ్స్ పట్టివేత. దోహా ప్రయాణికురాలి వద్ద 43.2 కోట్ల విలువ చేసే 3 కేజీల కొకైన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. తెల్లటి పౌడర్ రూపంలో కలిగి ఉన్న కొకైన్ ను స్కానింగ్ కు చిక్కకుండా నల్లటి ప్లాస్టిక్ కవర్ లో ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్ కింది బాగంలో దాచి తరలించే యత్నం చేసిన కిలాడి లేడి. వెస్ట్ ఆఫ్రికా నుండి దోహా మీదుగా ఢిల్లీ వచ్చిన లేడి కిలాడి పై అనుమానం కలగడం తో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. లేడి కిలాడి ని పలు విధాలుగా ప్రశ్నించిన కస్టమ్స్ బృందం. అధికారుల ముందు నోరు విప్పని లేడి. దోహా నుండి మోసుకొని వచ్చిన ట్రాలీ బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు. స్కానింగ్ కు చిక్కకుండా పకడ్బందీగా డ్రగ్స్ దాచిన కిలాడి

* డ్రగ్ డాన్ టోనీ కేసులో కీలక పరిణామం టోనీ దగ్గర నుంచి 2 సెల్‌ఫోన్లు స్వాధీనపరుచుకున్న పోలీసులు సెల్‌ఫోన్‌లో డేటా మొత్తాన్ని డిలీట్ చేసిన టోనీ వాట్సాప్, ఫేస్‌టైమ్ డేటాను ఎప్పటికప్పుడు డిలీట్ చేసిన టోనీ వాట్సాప్ చాటింగ్‌లను ప్రతిరోజు డిలీట్ చేసినట్లుగా గుర్తింపు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ముందుస్తుగా జాగ్రత్తపడ్డ టోనీ డేటా అనాలసిస్ కోసం ఫోరెన్సిక్ పంపించిన పోలీసులు టోనీ కాంటాక్ట్స్ లిస్టును రిట్రీవ్ చేసిన పోలీసులు వ్యాపారవేత్తలతో టోనీ టచ్‌లో ఉన్నట్లుగా తేటతెల్లం డ్రగ్స్ తీసుకున్న వ్యాపారవేత్తల చిట్టాతో పోలీసుల విచారణ టోనీ, వ్యాపారవేత్తల లింక్‌లను బయటకు తీస్తున్న టాస్క్‌ ఫోర్స్

*తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్‌ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్‌ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

*మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పుణె నుంచి ముంబైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వస్తున్న కారు షీలత్నే వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని, అప్పటికీ ఆగకుండా రోడ్డు అవతలి వైపు ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందికి దూసుకెళ్లిందని చెప్పారు. దీంతో కారు నుజ్జునుజ్జు అయిందని, అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

* నకిలీ కాల్ సెంటర్లు కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకవైపు అంతర్జాతీయ క్రెడిట్ కార్డు ఓల్డర్స్ , అలాగే బ్యాంకులను మోసం చేస్తున్నారు. సిస్టమ్‌లో మాల్‌వేర్ వైరస్ చొరబడిందని చెప్పి కోట్ల రూపాయలు మోసం చేస్తున్నారు. నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయల వరకు మోసం జరిగి ఉండొచ్చని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. మరో రెండు ముఠాల కోసం గాలిస్తున్నారు.

* వివాహితుడి లైంగిక వేధింపులు భరించలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూసింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలానికి చెందిన ఓ బాలిక(17) దామరచర్లలోని గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన భూక్యా కృష్ణ(బాధిత కుటుంబానికి బంధువు) ఆరు నెలలుగా ఆ బాలికను లైంగిక వేధింపులకు గు రిచేస్తున్నాడు. ఆ బాలిక ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు..వివాహితుడైన కృష్ణను పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. ఇటీవల సంక్రాం తి పండుగతో పాటు కరోనా సెలవులు ఇవ్వడంతో బాలిక ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కృష్ణ వేధింపులు అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిం ది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాగా, భూక్యా కృష్ణను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

* ఓ పాఠశాల బాలికను కిడ్నాప్ చేసి, అటవీప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బిచివారా గ్రామానికి చెందిన ఓ బాలిక తన సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. భోజన విరామ సమయంలో బాలిక బయటకు రాగా, 12వతరగతి చదివే ఓ విద్యార్థి బాలికను బలవంతంగా మోటారుసైకిలుపై ఎక్కించుకొని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై గంటల తరబడి అత్యాచారం చేశాడు. అనంతరం అమ్మాయిని ఆమె ఇంటి వద్ద వదిలేశాడు.అత్యాచారానికి గురైన బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

* కొమరోలు మండలం, అక్కపల్లిలో 11 ఏళ్ళ బాలుడు శ్రీనాథ్ హత్య కేసులో ఆర్మీ జవాన్ ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 22న ఆర్మీ జవాన్ బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేసి… మృతదేహాన్ని ఊరి శివారులో ఉన్న నీటి కుంటలో పడేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్మీ జవాన్‌ను అరెస్టు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

* భీమిలి మండలం ఆవనం గ్రామంలో హాయగ్రీవ రిసార్ట్స్‌లో పేకాట డెన్‌పై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెట్ బ్యూరో అధికారులు మెరుపు దాడి చేశారు. 22 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 5.70 లక్షల నగదు, 23 సెల్ ఫోన్లు, 9 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నగదు బదులుగా పేకాట రాయుళ్లు వినియోగిస్తున్న 321 ప్రత్యేక కాయిన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 25 లక్షలు ఉంటుందని, స్వాధీనం చేసుకున్న సొత్తును భీమిలి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* ఆలూరులో విషాదం నెలకొంది. ప్రేమకు పెద్దలు అడ్డంకిగా మారి ప్రియురాలను దూరంగా ఉంచారనే మనస్తాపంతో ఐటిఐ విద్యార్ధి విజయ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి ఆత్మహత్యను తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

* జి.కొండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చెవుటూరు వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

* విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఆకతాయి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో చోటు చేసుకుంది. తనను యువకుడు గత కొన్ని రోజులు వేధిస్తున్నాడని నోట్ బుక్‎లో రాసి బాలిక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఎంతో భవిష్యత్ ఉన్న బాలిక ఆకతాయి వేధింపులకు చనిపోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకులు పార్వతీపురంలోని ఎం. ఆర్ నగర్ కి చెందిన శివ, చరణ్, లోకేష్‎గా పోలీసులు గుర్తించారు.

* గాలివీడు మండలంలోని గుండ్లచెరువు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన తస్లీమ్‌ (20) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు…. రెడ్డివారిపల్లెకు చెందిన మన్సూర్‌తో లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామం మేడిమాకులగుంతకు చెందిన తస్లీమ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. భర్త సక్రమంగా చూడడం లేదనే మనస్థాపంతో శనివారం ఆమె ఆత్మహత్య చేసుకుందని, యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

* వంటగ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుని 13మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా బీహార్‌కు చెందిన కాంట్రాక్టు కార్మికులు. వివరాలు….విజయనగరం జిల్లా బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లోని బెర్రీ ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలో పనిచేస్తున్న యువకులు అదే కంపెనీలో ఓ గదిలో నివాసముంటున్నారు. పనిముగించుకొని శుక్రవారం రాత్రి వీరు గదికి చేరుకున్నారు.