Devotional

TNI నేటి మీ రాశి ఫలితాలు

TNI  నేటి మీ రాశి ఫలితాలు

*_ఓం శ్రీ గురుభ్యోనమః_*  *_శుభమస్తు_*  
*_31, జనవరి , 2022_**_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_* 
*_ఉత్తరాయణము_* *_హేమంత ఋతువు_*
*_పుష్య మాసము_**_కృష్ణ చతుర్దశి_*           
 *_ఇందు వాసరే_* *_(సోమవారం)_
*శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్*_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_
**_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_*                               
*_శివ రామ గోవింద నారాయణ మహాదేవా_**_విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్_**_హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్_*                               
*_రాశి ఫలాలు_*   *_మేషం_*ఈరోజుమనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహాసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. *_దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది_*

*_వృషభం_* ఈరోజుమధ్యమ ఫలితాలున్నాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. *_దుర్గ స్తోత్రం పఠించాలి_*

*_మిధునం_*ఈరోజువృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరుకు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. *_శని శ్లోకం చదవండి_*

*_కర్కాటకం_* ఈరోజు కీలక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. *_సూర్యాష్టకం చదివితే బాగుంటుంది_*

*_సింహం_*ఈరోజు తలపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు . మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. *_విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది_*

*_కన్య_*ఈరోజు మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధకలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. *_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది_*

*_తుల_*ఈరోజు మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మీరు ఊహించినదానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది. శత్రువులమీద మీరే విజయం సాధిస్తారు. *_శివారాధన మేలు చేస్తుంది_*

*_వృశ్చికం_*ఈరోజు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి_*

*_ధనుస్సు_*ఈరోజుబుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీమీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. *_శివ నామస్మరణ చేస్తే మేలు_*  

*_మకరం_*ఈరోజుమధ్యమ ఫలితాలున్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. *_శని శ్లోకం చదవాలి_*

*_కుంభం_*ఈరోజుపనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధికమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది_*

*_మీనం_*ఈరోజుమంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకు పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. *_ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది_*    
*_సమస్తసన్మంగళాని భవన్తు,_*                                                               
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_* *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,_**_లోకాసమస్తా సుఖినోభవంతు,_* *_సర్వేజనాః సుఖినోభవ,_*