Politics

జగ్గారెడ్డి మంతనాలు – TNI రాజకీయ వార్తలు 25/02/2022

జగ్గారెడ్డి మంతనాలు – TNI  రాజకీయ వార్తలు 25/02/2022

* కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం తన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయటవారికంటే తమ పార్టీ వారే అనవసర ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్తానంటే అడ్డుకునే వారు లేరని అన్నారు. వ్యక్తిగత రాజకీయం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టనని చెప్పారు. రాహుల్ నాయకత్వంలో మార్చి 21న లక్ష మందితో సభ నిర్వహిస్తానని, ఆ సభలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. హైకమాండ్‌ను కలిసే వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

*
* కేసీఆర్ డైనమిక్ సీఎం….అందుకే అన్నిరంగాల్లో అభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో డైనమిక్ సీఎం కేసీఆర్ ఉన్నారని, ఆయన సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రకవారం అటవీ, పర్యావరణంపై వర్క్ షాప్ జరిగింది.బేగంపేటలోని ఓహోటల్ లో జరిగిన ఈ వర్క్ షాప్ ను పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు అధిక ప్రాధన్యతనిస్తున్నారని అన్నారు. అడ‌వుల పెంప‌కం, ప‌చ్చ‌ద‌నం విస్తీర్ణాన్ని 24% నుంచి 33% పెంచేందుకు తెలంగాణ‌కు హ‌రిత‌హారం అనే మహోత్తర కార్యక్ర‌మానికి 2015 లో సీయం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.అటవీ ప్రాంతం వెలుపల 130 కోట్లు, అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలను నాటడం ల‌క్ష్యంగా పెట్టుకున్నాము

* ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్థులు సురక్షితం: మంత్రి ఆదిమూలపు
ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఫ్లైట్ లు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సుమారు 4000 మంది విద్యార్ధులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా‌కి ఆటంకాలు సృష్టిస్తున్నారని అనడం సరికాదన్నారు. తాగి మైకులు ముందుకు వచ్చి వాగే వారి మాటలను పట్టించుకోబోమని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనరాజు, తదితరులు పాల్గొన్నారు

* ఉక్రెయిన్‌లోని తెలుగువారిని ఆదుకునేందుకు తెలంగాణ చర్యలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. దిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ఏర్పాటు చేసి.. విదేశాంగ శాఖతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. అటు.. రాష్ట్ర భాజపా నేతలు సైతం.. బాధితుల పరిస్థితులను.. ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నారు.ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిల్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారందరికీ వీలైనంత త్వరగా దేశానికి రప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

* రేషన్‌ను మింగేసిన బీఎస్పీ ఏనుగు : యోగి ఆదిత్యానాధ్‌
యూపీలో రేష‌న్ అంత‌టినీ బీఎస్పీ ఏనుగు మింగేసింద‌ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీపై విరుచుకుప‌డ్డారు. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సుల్తాన్‌పూర్‌లో శుక్ర‌వారం జ‌రిగిన ర్యాలీలో యోగి మాట్లాడుతూ మార్చి 10న అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌గానే రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు విప‌క్ష నేత‌లు మార్చి 11న టికెట్లు బుక్ చేసుకున్నార‌ని ఎద్దేవా చేశారు. బీఎస్పీ హ‌యాంలో ఆ పార్టీ ఏనుగు క‌డుపు చాలా పెద్ద‌ద‌ని దీంతో రాష్ట్రంలో రేష‌న్ మొత్తం వారే మింగేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

* తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
సరికొత్త ఆవిష్కరణల ద్వారా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం హైదరాబాద్ లో వుండడం మనకు గర్వకారణమని అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ లో తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని అన్నారు.వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమని చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ ఎ ఓ వెల్లడించిందని తెలిపారు. హైదరాబాద్ ను చూసి గర్వపడే పరిస్థితి కేసీఆర్ కల్పించారని మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఐటీరంగం పురోగమిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని,వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామని అన్నారు

* దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్కూల్స్: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో భాగంగా, ఆ కార్యక్రమం పై కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష చేశారు. ముందుగా అధికారులు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. స్కూల్స్ ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? పథకం అమలు పై అధికారుల చర్యలేంటి? అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? వంటి పలు అంశాల పై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ జిల్లాలో492 స్కూల్స్ ఉండగా 176 స్కూల్స్ ని ఎంపిక చేశారు. ఇందులో 84 ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, 74 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి

*నాటో దేశాల జోలికొస్తే రంగంలోకి అమెరికా: బైడెన్
నాటో సభ్య దేశాల వైపు రష్యా సైన్యం వస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు అధ్యక్షుడు జో బైడెన్. తూర్పు ఐరోపాకు అదనపు బలగాలను పంపుతున్నట్లు వెల్లడించారు. శనివారం నాటో దేశాల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యా.. నాటో సభ్య దేశాలవైపు దూసుకొస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. పుతిన్ను ఇప్పుడు ఆపకపోతే మరింత రెచ్చిపోతాడని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షలు విధించిన అనంతరం ఈమేరకు శ్వేతసౌధంలో గురువారం మీడియాతో మాట్లాడారు.”ఒకవేళ పుతిన్.. నాటో సభ్య దేశాల వైపు వెళ్తే మేం జోక్యం చేసుకుంటాం. నేను ఒప్పకునే ఏకైక విషయం ఏమిటంటే.. పుతిన్ను ఇప్పుడు ఆపకపోతే అతని ధైర్యం మరింత పెరుగుతుంది. అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టకపోతే మరింత రెచ్చిపోతాడు. అందుకే రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. తూర్పు ఐరోపా దేశాలకు అవసరమైన బలగాలను సమకూర్చడం ద్వారా ఇది పెద్ద ఘర్షణకు దారీతీయదని మేము భావిస్తున్నాం. నాటో దేశాలు గతంలో ఎన్నడులేనంత ఐక్యంగా ఉన్నాయి. పుతిన్తో మాట్లాడే ఆలోచన నాకు లేదు. ఆయన సోవియట్ యూనియన్ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులకు అతని ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి

*భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ.. సినిమాపై ఎందుకు..! : చంద్రబాబు
భీమ్లానాయక్‌ సినిమా విషయంలో.. సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై.. తెదేపా నేతలు ధ్వజమెత్తారు. భీమ్లానాయక్‌ సినిమా విషయంలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.భీమ్లానాయక్‌ సినిమా విషయంలో.. సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జగన్ తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్రబాబుభీమ్లానాయక్‌ సినిమా విషయంలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని వ్యవస్థలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ..భీమ్లా నాయక్‌ సినిమాపై ఎందుకని ప్రశ్నించారు.

*మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలకు పవన్ అభిమానుల సెగ
రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని,పేర్ని నాని పాల్గొన్నారు. ప్రారంభ చిత్రంగా థియేటర్లో భీమ్లా నాయక్ ప్రదర్శించనున్నారు. కాగా థియేటర్ వద్ద మంత్రి పేర్ని నానిని అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున అభిమానులు నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమని అభిమానులు మండిపడుతున్నారు. ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం అన్యాయమని జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు

*వైసీపీ ప్రభుత్వం మోసానికి బ్రాండ్ అంబాసిడర్: దూళిపాల నరేంద్ర
వైసీపీ ప్రభుత్వం మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విభజన తర్వాత ఏపీ చిన్న రాష్ట్రం అయిందన్నారు. అమరావతి రాజధానిగా ఒప్పుకున్న జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారని దుయ్యబట్టారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు.. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు, ప్రజలు మహా ఉద్యమాన్ని నడుపుతున్నారన్నారు. అధికారం ఉందని ముళ్ల కంచెలు వేసినా… వాటిని దాటి 800 రోజులుగా ఉద్యమం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతిలో ఏముంది? శ్మశానం అని వైసీపీ నేతలు హేళన చేశారని, ఇప్పుడు ఆ శ్మశానాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా…? అని దూళిపాల నరేంద్ర ప్రశ్నించారు

*సీఎం జగన్ మొండోడు: ప్రత్తిపాటి పుల్లారావు
సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండోడని…. కక్ష సాధింపు తప్ప ఆయన ఏమి చేయరని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు చేశారు. రైతులు చేపట్టిన దీక్ష విరమణ కార్యక్రమంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫ్యాన్‌కి ఓట్ వేసిన వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నారు. ప్రజా స్పందన చూసి ప్రభుత్వం మారాలని హితవుపలికారు. అరసవల్లి పాదయాత్ర పెడితే ప్రభుత్వానికి మీకు ఉన్న మద్దతు అర్థం అవుతోందన్నారు. కేంద్రంలో కన్నింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రత్తిపాటిపుల్లారావు మండిపడ్డారు

*ఒక్క ఛాన్స్‌తో తెచ్చుకున్నందుకు ఈ ఖర్మ పట్టింది: Ayyanna
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘అ.. ఆలు దిద్దించే అయ్య‌వార్ల‌ని బ్రాందీ షాపుల‌కు కాప‌లా పెట్టిన ముఖ్య‌మంత్రి సారు… మండ‌ల ప‌రిపాల‌న చూసే రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల‌కి గేటుమేన్లను చేశారు. ఒక్క చాన్స్‌తో తెచ్చుకుని ద‌రిద్రాన్ని నెత్తికెత్తుకున్న పాపానికి ఈ ఖ‌ర్మ ప‌ట్టింది’’ అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు

*బీజేపీ ఓడిపోవ‌డం ఖాయంప: ఏఐసీసీ కార్యదర్శి
బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి అస్త‌వ్య‌స్త విధానాల‌తో దేశాన్ని నాశనం చేసిందని ఏఐసీసీ కార్య‌ద‌ర్శి గిడుగు రుద్ర‌రాజు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…మ‌తం పేరుతో రాజ‌కీయం చేస్తూ వివాదాలు సృష్టించిందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోవ‌డం ఖాయ‌మని స్పష్టం చేశారు. ఈ ఎన్నిక‌లు రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు రిఫ‌రెండ‌మ్‌గా భావిస్తున్నామని తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయిన వారి మ‌ర‌ణాల‌కు కేంద్ర‌ ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌న్నారు. కాంగ్రెస్ పార్టీ పున‌ర్వైభ‌వం త్వ‌ర‌లోనే దేశ ప్ర‌జ‌లు చూడ‌బోతున్నార‌ని తెలిపారు. ఎనిమిదేళ్లుగా మ‌త‌త‌త్వ శ‌క్తుల పాల‌న‌ను చూసిన ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ అవ‌స‌రాన్ని గుర్తించారని గిడుగు రుద్రరాజు అన్నారు

*ఉక్రెయిన్‌‌కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తే.. ఖర్చులు భరిస్తాం: మంత్రి కేటీఆర్
ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వారిని త్వరితగతిన భారత్‌కు రప్పించాలంటూ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ట్విట్టర్ ద్వారా మంత్రి విజ్ఙప్తి చేశారు. ఉక్రెయిన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తే ఖర్చులు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు

* కి రాష్ట్ర ఆర్థికం: శైలజానాథ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం జగన్ అగాధంలోనికి నెట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో.. తట్టెడు మట్టి వేయకుండా, ఒక్కప్రాజెక్టూ పూర్తి చేయకుండా, కోట్ల రూపాయల నిధులు ఏం చేశారని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా 2021-22లో రూ.94000 కోట్లకు పైగా ఖర్చు చేశారని కాగ్ తప్పుబట్టడం చూస్తే ప్రభుత్వం ఎన్ని నిధులను దుర్వినియోగం చేసిందో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు

*కొత్త జిల్లాలు అనవసరం: తులసిరెడ్డి
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అసందర్భ ప్రక్రియ అని, కొత్త జిల్లాలు అనవసరమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడుతుందేమో కానీ, ప్రజలకు ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అనంతపురంలో మీడియాతో తులసిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశా కేంద్రాలుగా మారాయని మండిపడ్డారు.

*రాష్ట్ర వ్యాప్తంగా ఎవెన్యూ ప్లాంటేషన్: హరీశ్
మున్సిపాలిటీలు, గ్రామాల్లోని రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. పీపుల్స్ప్లాజాలో గురువారం ఆయన నర్సరీ మేళాను ప్రారంభించి మాట్లాడుతూ ఇళ్లలో మొక్కలను పెంచడం ద్వారా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఇంటితోపాటు పట్టణంలో మంచి మొక్కలను పెంచాలనే ఉద్దేశంతోనే తాను నర్సరీ మేళాకు వచ్చినట్లు చెప్పారు. 28 వరకు జరిగే మేళాను నగరవాసులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.