Business

కోలుకున్న మార్కెట్లు – TNI వాణిజ్యం 25/02/2022

కోలుకున్న మార్కెట్లు TNI  వాణిజ్యం 25/02/2022

*భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. నిన్నటి భారీ పతనం నేపథ్యంలో కనిష్ఠాల వద్ద ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మరోవైపు రష్యా చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షల్ని ప్రకటించాయి. ఇవి రష్యాను కొంతమేర నిలువరించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణం వల్ల.. గురువారం ఆరంభంలో భారీగా నష్టపోయిన అమెరికా సూచీలు ఆఖర్లో కొంత పుంజుకొని నష్టాల్ని పరిమితం చేసుకున్నాయి. అదే బాటలో పయనిస్తున్న ఆసియా మార్కెట్లు ప్రస్తుతానికి కొంత సానుకూలంగా కదలాడుతున్నాయి. మరోవైపు యుద్ధ భీతితో ప్రపంచవ్యాప్తంగా బాండ్ల రాబడులు గణనీయంగా పడిపోవడం కూడా సూచీలకు కలిసొచ్చింది.

* ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!
దేశంలోని అతిపెద్ద భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో ఐపీఓకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు ఆఫర్ సైజ్‌లో 10 శాతం కోటా లభించనుంది. అంటే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు ఈ ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఇష్యూ ప్రైస్‌లో డిస్కౌంట్ కూడా లభించనుంది. మరోవైపు ఉద్యోగుల కోటా 5 శాతం ఉండనుంది.

*కడప నుంచి అయిదు నగరాలకు ఇండిగో సేవలు
విమానయాన సంస్థ ఇండిగో.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి అయిదు నగరాలకు సర్వీసులు నడపనుంది. వీటిలో మార్చి 27 నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది. కరోనా విలయతాండవం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కరోనా నుంచి కోలుకునే సమయంలోనే ఫ్యూయల్‌ ధరల పిడుగుపడింది. దీంతో ఏవియేషన్‌ సెక్టార్‌ ఇప్పుడప్పుడే గాడిన పడదు అనే వాదనలు వినిపించాయి. కానీ కడప లాంటి టైర్‌ త్రీ సిటీస్‌లో కూడా తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్‌ సెక్టార్‌ త్వరగా కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

*దేశీయంగా ఎలకా్ట్రనిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు రెడీ అవుతున్నాయి. సుమారు రూ.1,53,750 కోట్ల (2,050 కోట్ల డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు ఐదు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వేదాంత ఫాక్స్కాన్ భాగస్వామ్య సంస్థ, ఐజీఎ్సఎస్ వెంచర్స్, ఐఎ్సఎంసీ 130.6 కోట్ల డాలర్ల (రూ.1.02 లక్షల కోట్లు) పెట్టుబడితో ఎలకా్ట్రనిక్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాయని తెలిపింది. అంతేకాకుండా రూ.76,000 కోట్లతో కూడిన సెమీకాన్ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.42,000 కోట్ల మేర పెట్టుబడుల మద్దతును ఈ కంపెనీలు కోరుతున్నాయని పేర్కొంది.

*ఆర్థికంగా దివాలా తీసిన ల్యాంకో గ్రూప్నకు ఉత్తరప్రదేశ్లోని అన్పరలో ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు మూడు కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ఈ జాబితా లో హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఐల్యాబ్స్ గ్రూప్తో పాటు ఢిల్లీకి చెందిన హిందుస్తాన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (హెచ్పీపీఎల్) ఉన్నాయి.

*రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కొద్దో గొప్పో భారత్పైనా పడనుంది. వంటింటి బడ్జెట్పై మాత్రం ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. మన దేశంలో ఉపయోగించే పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) నూనెలో ఎక్కువ భాగం ఈ రెండు దేశాల నుంచే వస్తోంది. 2020-21లో మన దేశం ఈ రెండు దేశాల నుంచి 19 లక్షల టన్నుల పొద్దు తిరుగుడు నూనె దిగుమతి చేసుకుంది. ఇందులో 80 శాతం ఉక్రెయిన్ నుంచి 20 శాతం రష్యా నుంచి దిగుమతైంది. తాజా ఉద్రికత్తలతో ఈ వంట నూనె సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. నిన్న మొన్నటి వరకు రిటైల్ మార్కెట్లో లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ రూ.145-150 మధ్య దొరికేది. తాజా పరిణామాలతో అది గత రెండు రోజుల్లో రూ.162కి చేరింది.

*రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దేశీయ ఫార్మా కంపెనీలను భయపెడుతోంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటి కంపెనీలు మాజీ సోవియట్ దేశాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఔషధాలు ఎగుమతి చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్నే తీసుకుంటే ఈ కంపెనీ ఆదాయంలో దాదాపు 8 శాతం ఈ దేశాల నుంచి వస్తోంది. ఇందులో రష్యా, ఉక్రెయిన్ పెద్ద మార్కెట్లు. తాజా పరిణామాలతో ఈ ఎగుమతులకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం భారత ఔషధ కంపెనీలు మాజీ సోవియట్ దేశాలకు 117.8 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేశాయి. అందులో 77 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చేశాయి. లాజిస్టిక్స్, చెల్లింపుల పరంగా ఈ రెండు దేశాలకు చేసే ఔషధ ఎగుమతుల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ చెప్పారు.

*ఐకియా ఇండియా సీఈఓగా సుసన్నే పల్వెరర్ను నియమించింది. ఐకియా ఇండియా సీఈఓగా ఒక మహిళను నియమించడం ఇదే మొదటిసారి. ఆమె ఐకియా ఇండియాకు చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్(సీఎ్సఓ)గా కూడా వ్యవహరిస్తారు.

*నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ కోస్టల్ అయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రా లిమిటెడ్ను (సీఓజీఐఎల్) హల్దియా పెట్రోకెమికల్స్ లిక్విడేషన్ ప్రక్రియలో చేజిక్కించుకుంది. ఛటర్జీ గ్రూప్ (టీసీజీ) అనుబంధ సంస్థ హెచ్పీఎల్ సమర్పించిన లిక్విడేషన్ ప్లాన్ను ఎన్సీఎల్టీ అమరావతి బెంచి గత వారంలో ఆమోదించింది. కొనుగోలు కోసం రూ.37.5 కోట్లు చెల్లించేందుకు హెచ్పీఎల్ అంగీకరించింది. గత రెండేళ్ల కాలంలో దివాలా ప్రక్రియలో టీసీజీ గ్రూప్ చేజిక్కించుకున్న మూడో కంపెనీ ఇది. విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన సీఓజీఐఎల్కు తమిళనాడులోని కడలూర్లో 322 ఎకరాల భూమి ఉంది. అది ఈ లిక్విడేషన్ ప్రక్రియలో హెచ్పీఎల్ చేతికి మారుతుంది.

*దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఐటీ కంపెనీలు కార్యాలయం నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నాయి. 65 శాతం కంపెనీలు హైబ్రిడ్ పని విధానం అనుసరిస్తూనే ఉద్యోగులను కార్యాలయానికి రావాలని కోరుతున్నట్టు తేలింది. హైసియా నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మొత్తం 68 కంపె నీల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటిలో దేశీయ, విదేశీ ఎంఎన్సీలు, పెద్ద ఐటీ కంపెనీ లు, ఎస్ఎంఈ శ్రేణిలోకి వచ్చే కంపెనీలు అన్నీ ఉన్నాయి. అంతర్జాతీయ, జాతీయ విధా నాలకు అనుగుణంగా స్థానిక ఎక్కడ నుంచి పని చేయాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ స్థానిక నాయకత్వానికే ఇస్తున్నట్టు కంపెనీలు తెలిపాయి.

*ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను దేశీయ, ఎగుమతి మార్కెట్లకు తరలించిన మైలురాయిని కియా ఇండియా అధిగమించింది. మరోవైపు దేశంలో 4 లక్షల కార్ల విక్రయాల మైలురాయిని కూడా కంపెనీ అధిగమించింది. కియా.. 2019 సెప్టెంబరులో సెల్టోస్ ఎగుమతితో విదేశీ మార్కెట్లకు విస్తరించిన నాటి నుంచి 91కి పైగా దేశాలకు లక్షకు పైగా కార్లు ఎగుమతి చేసింది. భారత్ నుంచి యుటిలిటీ వాహనాల భారీ ఎగుమతిదారుగా కూడా నిలిచింది. 2021లో కంపెనీ 25 శాతం పైబడి వాటా సాధించింది. 5 లక్షలనేది పెద్ద సంఖ్య అని, కేవలం రెండున్నర ఏళ్లలో ఈ మైలురాయిని దాటడం గర్వకారణమని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తేజిన్ పార్క్ అన్నారు.

*ఎన్ఎల్సీ ఇండియా ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా కలసాని మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మోహన్ రెడ్డి గతంలో సింగరేణి కాలరీస్, కోల్ ఇండియాకు చెందిన వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్లోనూ పని చేశారు. ఇప్పటి వరకు ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థతో కలిసి ఎన్ఎల్సీ ఇండియా ఏర్పాటు చేసిన నైవేలీ ఉత్తర ప్రదేశ్ పవర్ లిమిటెడ్ (ఎన్యూపీపీఎల్) కంపెనీకి సీఈఓగా పనిచేశారు. కోల్కతాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) నుంచి మైనింగ్లో ఇంజనీరింగ్ పట్టా పొందిన రెడ్డి ఎంబీఏ ఫైనాన్స్ కూడా పూర్తి చేశారు.

*భారత్-యూఏఈ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పం దం భారత ఫార్మా కంపెనీలకు ఎంతగానో కలిసిరానుంది. భారత్తో యూఏఈ కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో చేర్చిన పలు ఉత్పత్తుల్లో ఔషధాలు కూడా ఉండటం ఇందుకు దోహదపడనుంది. ఫార్మా ఉత్పత్తులకు అనుమతులు వేగవంతం చేయటంతో పాటు యూఏఈలో భారత ఔషధాలకు డిమాండ్ పెంచేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నాయని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్జిల్) డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ అన్నారు.