Food

రెండు ఇడ్లీలూ పాతిక చట్నీలూ!

రెండు ఇడ్లీలూ పాతిక చట్నీలూ!

టిఫిన్ సెంటర్ కెళ్లి ఇడ్లీలు అడిగినా మించిపోతే మూడు రకాల చట్నీలు పెడతారు ! కానీ చెన్నై కన్నదాసన్ నగర్ లోని ఈ ఇడ్లీ షాపులో మీరు సింగిల్ ఇడ్లీ తీసుకున్నా … పాతిక రకాల చట్నీలని రుచి చూడొచ్చు . ఆ చట్నీలు కూడా చిత్రంగా ఉంటాయి . తంగేడు చట్నీ , పైనాపిల్ చట్నీ , సరస్వతీ ఆకు చట్నీ , గ్రీన్ టీయాకు చట్నీ అని మొదలు పెట్టి క్యాబేజీ , ఉలవ , నువ్వులు , వెల్లుల్లి , అల్లం … ఇలా ఊహించలేనన్ని ఆహారపదార్థాల వెరైటీల్ని మన ముందు ఉంచుతారు . వీటిలో వేటిని ఎంచుకుని వేటిని వదిలేయాలో నిర్ణయించుకోలేక సతమతమవుతుంటాం . ఇంతకీ ఇదేమీ బాగా ఖరీదైనది కూడా కాదు … ప్లేట్ ఇడ్లీ పాతిక రూపాయలకి అమ్మే మామూలు రోడ్డుసైడు షాపు . షాపులోని ఈ పాతికరకాల చట్నీలు ఎప్పుడూ అవే ఉండవు . రోజురోజుకీ మారుతూ ఉంటాయి . ఒక్క పండ్ల చట్నీలే తీసుకుంటే .. ఓ రోజు పైనాపిల్ , మరోరోజు బత్తాయి , ఇంకోరోజు ఆరెంజ్ ఇలా వెరైటీస్ చేస్తూనే ఉంటారు . అంటే , వారం రోజులు మీరు ఇక్కడ టిఫిన్ తినడానికి వెళితే దాదాపు 200 దాకా చట్నీలను రుచి చూస్తారన్నమాట !