Fashion

‘పుష్ప’ చీరలొచ్చాయ్..!

Auto Draft

‘పుష్ప … మన తెలుగు సినిమా పాన్ ఇండియాలో విడుదలై సూపర్ హిట్ కొట్టింది . ‘ సామీ సామీ ‘ అంటూ పాటలతో , ‘ చూపే బంగారమాయనే శ్రీవల్లి ‘ .. అంటూ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకున్న ఈ చిత్రం దేశమంతటా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది . అయితే ఇప్పుడు అదే క్రేజ్ చీరలమీదకూ చేరిపోయింది . గుజరాత్లోని సూరత్కు చెందిన చరణ్ జీత్ క్లాత్ క్రియేషన్స్ ఈమధ్య అల్లు అర్జున్ , రష్మిక మందన్నా డ్యాన్స్ చిత్రాలతో ‘ పుష్ప చీరల్ని తయారుచేసింది . ఈ చీరల ఫొటోలూ , వీడియోలూ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి . ఇంకేముంది … వాటిని చూసిన పక్క రాష్ట్రాల బట్టల దుకాణాదారులు కూడా ఈ సరికొత్త చీరలు మాకూ కావాలి అంటూ ఆర్డర్లు ఇస్తున్నారట.
p