ScienceAndTech

రష్యాలో వీసా, మాస్టర్‌కార్డ్‌ సేవలు బంద్‌

రష్యాలో వీసా, మాస్టర్‌కార్డ్‌ సేవలు బంద్‌

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షల పర్వం కొనసాగుతున్నది. ఆపిల్‌, సామ్‌సంగ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, బీబీసీ వంటి సంస్థలు ఇప్పటికే రష్యాలో తమ సేవలను నిలిపివేశాయి. తాజాగా ఆ జాబితాలో వీసా, మాస్టర్‌కార్డ్‌ చేరాయి. అమెరికన్‌ పేమెంట్‌ సంస్థలైన వీసా, మాస్టర్​కార్డ్​.. రష్యాలో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో తమ సేవలను ఆపేస్తామని స్పష్టం చేశాయి.రష్యాలో విడుదల చేసిన వీకా కార్డులు.. ఆ దేశం వెలుపల, రష్యా బయట విడుదల చేసి కార్డులు ఆ దేశంలో మరికొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయని ఆ సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్‌ కెల్లీ చెప్పారు.కాగా, రష్యాలోని అన్ని స్టోర్లలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పూమా తెలిపింది. ఇప్పటికే ఆ దేశానికి సరఫరా ఆపేశామని పేర్కొంది. అదేవిధంగా ప్రముఖ మొబైల్‌ఫోన్‌ తయారీదారు సామ్‌సంగ్‌ కూడా రష్యాకు ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు అజర్‌బైజన్‌ ఎయిర్‌లైన్స్‌ తన అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.