NRI-NRT

అమెరికా మాజీ అధ్యక్షుడుకి కొవిడ్ పాజిటివ్

Auto Draft

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.తనకు కొవిడ్ -19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని, తనకు రెండు రోజులుగా గొంతు నొప్పి ఉందని బరాక్ ఒబామా చెప్పారు. తనకు కరోనా సోకినా బాగానే ఉన్నానని ఒబామా ట్విట్టర్‌లో రాశారు. ‘‘నా భార్య మిచెల్, నేను కొవిడ్ టీకాలు వేయించుకున్నాం. మిచెల్ కు కొవిడ్ నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మీరు ఇప్పటికే టీకాలు వేయించుకోకుంటే, కొవిడ్ టీకాలు వేయించుకోవాలని కోరుతున్నాను’’ అని బరాక్ ఒబామా కోరారు.