NRI-NRT

కొండగట్టులో టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుక

కొండగట్టులో టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుక

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూకే, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. దాదాపు 2వేలకుపైగా భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి, ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు.సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవి శంకర్ కేక్‌ కట్‌ చేసి, బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. కొండగట్టులో భక్తులకు అన్నదానం చేయడంతో పాటు ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్న కుర్మాచలం అనిల్‌ బృందాన్ని అభినందించారు. అలాగే ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదన్నారు. ముఖ్యంగా లండన్‌ నుంచి ఎన్నారై టీఆర్‌ఎస్‌ ఇచ్చిన స్ఫూర్తి గొప్పదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంకా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ప్రార్థించారు. అనంతరం అనిల్‌ మాట్లాడుతూ కొండగట్టుపై అన్నదాన కార్యక్రమానికి సహకరించినందుకు ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమంలో సేవలందించిన రాజ్ కుమార్ శానబోయిన, రాజేశ్‌ భండారి, దూస గణేశ్‌, ప్రమోద్ కక్కెర్ల, సుధాకర్, మారుతీని అభినందించారు. అనంతరం పలువురు నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
pol