Movies

అదే.. ఇష్టమైన ఫుడ్‌!

అదే.. ఇష్టమైన ఫుడ్‌!

బాలీవుడ్‌లో హల్చల్‌ చేస్తున్న దీపికా పదుకోన్‌ పుట్టింది దక్షిణాదినే. బెంగుళూరులోనే ఎక్కువ జీవితం గడిపింది. ముంబైలో ఉన్నా సదరెన్‌ రుచులకే ఓటేస్తుందీమె. దక్షిణాది వంటకాలంటేనే ఘుమఘుమలంటుంది దీపికా!‘‘ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ‘మీకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటీ?’ అని అడిగాడు ఓ నెటిజన్‌. అప్పుడు ‘కుకీస్‌’ అని చెప్పా. ఆ సమయానికి అలా చెప్పా. హోమ్‌ మేడ్‌ కుకీస్‌ అంటే ఇష్టపడతా. దక్షిణాదిలో అందునా బెంగుళూరులో జీవితం గడిపిన నాకు.. పక్కా సౌత్‌ ఇండియన్‌ డిష్‌ నచ్చుతుంది. బిర్యానీ అంటే ఇష్టం. అన్నింటికంటే రసమన్నం నాకిష్టం. అది ఫేవరేట్‌ ఫుడ్‌. బెంగుళూరులో ఉన్నపుడు రసమన్నం లేకుంటే ముద్ద దిగేది కాదు. సౌత్‌ ఇండియాలోని పిల్లలు, అమ్మాయిలు ఎక్కువశాతం ఇష్టపడే ఫుడ్‌ రసమన్నమే. ఇప్పటికీ రోజూ రసమన్నం తింటా. ఉదయాన్ని నిమ్మరసంతో స్టార్ట్‌ చేస్తా. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆల్మండ్స్‌, లేదా కోడిగుడ్లు తింటా. వారంలో ఎక్కువగా నా బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లి, వడ, దోశ కనిపిస్తాయి. లంచ్‌ సమయంలో రసమన్నం తింటా. తాజా పండ్లను తీసుకుంటా. సాయంత్రం పూట ఫిల్టర్‌ కాఫీ తాగటం ఇష్టం. నా పెళ్లిలోనూ పక్కా బెంగళూరు స్టయిల్‌ ఫిల్టర్‌ కాఫీ అథితులకు రుచిచూపించా. సాయంత్రం పూట కారులో వెళ్తున్నపుడు స్ర్టీట్‌ఫుడ్‌ మీద మనసు పడుతుంది. అదికూడా పానీపూరీ అంటే లొట్టలేసుకుని తింటా. రాత్రిపూట సలాడ్స్‌, చేపలు తింటా.’’