Movies

నిద్రపడితే ఒట్టు!

నిద్రపడితే ఒట్టు!

‘‘ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకూ కుదురుగా ఉండలేను. నిద్ర పడితే ఒట్టు. ఇరవై నాలుగ్గంటలూ పనిమీదే ధ్యాస’’ అంటున్నారు సమంత. వృత్తిమీద అంత అంకిత భావం ఉంది కాబట్టే, కథానాయికగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నారామె. ప్రస్తుతం ‘శాకుంతలమ్‌’, ‘యశోద’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. బాలీవుడ్‌లోనూ కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకున్నారు. సమంత మాట్లాడుతూ ‘‘ఏ పని చేసినా.. ముందు పనిని ప్రేమించాలి. అప్పుడు అందులో ఎంత కష్టమున్నా ఇష్టంగానే చేస్తాం. సినిమా రంగం పైకి కలర్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ… ఒక్కో ఫ్రేమ్‌ కోసం ఎంతెంత కష్టపడతారో నాకు తెలుసు. ఒక్కో సారి.. రెండు సెకన్ల షాట్‌ కోసం గంటల కొద్దీ వెచ్చించాల్సి ఉంటుంది. మన మూడ్‌తో పనిలేకుండాపాత్ర స్వభావాన్ని బట్టి కెమెరా ముందు ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రొఫెషనలిజం ఉంటేనే అది సాఽఽధ్యమవుతుంది. ఇంత కష్టపడినా ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని ఆశించకూడదు. హిట్టుఫ్లాపులతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లడం మరింత కఠినమైన కసరత్తు. అందుకే ఏ సినిమానీఎవరి కష్టాన్నీ తక్కువ అంచనా వేయకండిఅని చెప్పుకొచ్చారు.