Fashion

ఈ 90 ఏళ్ల జంట యువతకు ఆదర్శం

Auto Draft

ఇటీవల పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటలాగా ముగిసిపోతున్నాయి. వివాహం జరిగి ముచ్చటగా మూడేళ్లు కూడా పూర్తి అవ్వకుండానే విడాకులు అంటూదూరమైపోతున్నాయి కొన్ని జంటలు.ఇంకొందరైతే మొదటి వివాహదినోత్సవం జరుపుకోకుండానే విడిపోతున్నారు. అటువంటివారికి ఆదర్శంగా ఓజంట తమ 90వ వివాహ దినోత్సవాన్ని అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు.90వ వివాహ దినోత్సవం అంటే వారికి ఎన్నేళ్లు అనే డౌట్ వచ్చే ఉంటుంది. నిజమే మరి వివాహాదినోత్సవమే సెంచరీకి దగ్గరలో ఉంటే ఇక వారికి ఎన్నేళ్లు ఉంటాయనే డౌట్ రానే వస్తుంది. ఆ వృద్ధ జంట వివాహ విశేషాలేంటో తెలుసుకుందాం..చైనాకు చెందిన జరుపుకుంటున్నారు. అతని 109 ఏళ్లు, ఆమెకు 108 ఏళ్లు. పైగా ఇద్దరు మంచి పెళ్లి దుస్తులు ధరించి తమ గతం తాలుకు జ్ఞాపకాలకు వెళ్లిపోయారేమో అన్నట్లుగా ఉ‍న్నారు.అంతేకాదు ఇన్నేళ్ల తమ దాపత్యంలోని మధురానుభూతులు నెమరు వేసుకుంటూ కెమరా ముందు చక్కగా ఫోజులిచ్చారు. అతను నల్లటి సూట్ వేసుకున్నాడు.ఆమె తెల్లటి గౌను వేసుకుంది. వివాహం జరిగినప్పుడు ఎలా రెడీ అవుతారో ఈ వృద్ధ జంట కూడా అలాగే రెడీ అయి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ వృద్ధ జంట 90వ వివాహవేడుక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.