DailyDose

సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతుల నోటీసులు – TNI తాజా వార్తలు

సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతుల నోటీసులు – TNI  తాజా వార్తలు

* సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు. భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రైతుల ప్లాట్లను.. మూడేళ్లలోగా అభివృద్ధి చేయాలని నిబంధన ఉంది. అభివృద్ధి చేయకపోవడంతో జీవనోపాధి కోల్పోయామని రైతులు పేర్కొంటూ ఎకరానికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని నోటీస్‌లో పేర్కొన్నారు. రైతుల తరపున సీఆర్డీఏ, ఏపీ రేరాకు హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్‌ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ను ఎందుకు తీసుకోలేదని ఏపీ రేరాకు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రైతుల నివాస స్థలాలకు గజానికి నెలకు రూ.50, వాణిజ్య స్థలాలకు గజానికి రూ.75 చొప్పున పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

*ఏప్రిల్‌లో ఇండియా రానున్న ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని మోదీ వినతి మేరకు ఏప్రిల్ 2-5 వరకు నఫ్టాలీ ఇండియాలో పర్యటించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ, నఫ్టాలీని ఆహ్వానించారు. నఫ్టాలీ ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా రావడం ఇదే మొదటిసారి. గత అక్టోబర్‌లో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ-నఫ్టాలీ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో మోదీ, నఫ్టాలీని ఇండియా రమ్మని ఆహ్వానించారు. నఫ్టాలీ భారత పర్యటన సందర్భంగా ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు పలు అంశాలపై చర్చిస్తారు. ప్రధానంగా ఇన్నోవేషన్ టెక్నాలజీ, భద్రత, సైబర్, ఎకానమీ, వ్యవసాయం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. భారత పర్యటన కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు నఫ్టాలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

*బోధన్‌లో శివాజీ విగ్రహాం ఏర్పాటుపై వివాదం నెలకొంది. శివసేనబీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో మైనార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన ప్రదేశానికి ఇరువర్గాల నాయకులుకార్యకర్తలుస్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకుప్రయత్నం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు.
*
*పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహించిన జాతీయస్థాయి అందాల పోటీలలో తూర్పుగోదావరిజిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు పుంగనూరు ఆవులకు ప్రథమద్వితీయబహుమతులు లభించాయి. ద్వారకా తిరుమలలో మూడు రోజులపాటు దేశవాళీ ఆవుల పాలు దిగుబడివివిధ జాతుల ఆందాల పోటీలు ఏర్పాటుచేశారు. పుంగనూరు ఆవుల ఆందాల విభాగంలో గుమ్మిలేరుకు చెందిన రైతు రెడ్డి వీరవెంకట సత్యనారాయణమూర్తికి చెందిన రెండు పుంగనూరు ఆవులకు ఈ బహుమతులు లభించాయి.

*సీబీఎ్‌సఈ 12వ తరగతి టర్మ్‌-1, 2022 పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మార్కుల పత్రాలను ఆయా పాఠశాలలకు సీబీఎ్‌సఈ ఈ-మెయిల్‌ ద్వారా పంపింది. విద్యార్థులు తమ పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి మార్కుల పత్రాలు తీసుకోవాలి. కాగా, 10, 12 తరగతుల టర్మ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 26న ప్రారంభం కానున్నాయి.

*ఆగ్నేయ బంగాళాఖాతందానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శనివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. అండమాన్‌ నికోబార్‌ దీవులకు ఆనుకుని పయనించేక్రమంలో ఆదివారానికి వాయుగుండంగాసోమవారానికి తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ తెలిపింది. మంగళవారానికి బంగ్లాదేశ్‌ఉత్తర మయన్మార్‌ తీరాల దిశగా పయనించనుందని పేర్కొంది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాష్ట్రంలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కర్నూలుకడపఅనంతపురంలలో డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

*యువత చదువు పూర్తికాగానే ఉద్యోగానికే ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యాపార రంగంలో స్థిరపడి స్వయం సమృద్ధి సాధించాలని శాంతా బయోటెక్స్‌వ్యవస్థాపకుడు పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై స్వధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ధర్మజ్యోతి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా.. పురస్కార గ్రహీత వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను తయారుచేసి వాటిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి యువత ఎదగాలన్నారు. స్వధర్మాన్ని పాటిస్తూ దేశ పురోభివృద్ధికి పాటు పడాలని సూచించారు.

*గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేరుతో మెమో ఒకటి శనివారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇక నుంచి యూనిఫాం ధరించాల్సిన అవసరం లేదని, ఆమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని పేర్కొంటూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ సంతకం లేకుండా ఉన్న మెమో సోషల్‌ మీడియాలో విస్తృతంగా తిరిగింది. మెమో నం.01/127/2022- జీడబ్ల్యూఎస్‌గా పేర్కొన్నారు. అయితే ఇది నకిలీదని నిర్ధారణ అయింది. ‘‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనిఫాం రద్దు చేస్తున్నట్లు ఓ నకిలీ మెమోని సృష్టించి సోషల్‌ మీడియాలో పెట్టారు. అది నేను విడుదల చేసింది కాదు’’ అని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ వివరణ ఇచ్చారు. దీనిపై పోలీసు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

*చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ జనగ ణన కోసం జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు ఉద్యమం చేయనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో శనివారం జరిగిన సదస్సు లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రకారం బీసీలకు బడ్జెట్‌లో నిధులుకేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంఘం జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దాసు సురేష్‌ హెచ్చరించారు. పార్లమెంటు ముట్టడి, ప్రధాని, మంత్రుల ఇళ్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

*ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలను వంద వరకు ఆవిష్కరించాల ని టీడీపీ తెలంగాణ శాఖ ప్రతిపాదించింది. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్రశాఖ సర్వస భ్య సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడులో త్వరలో జరిగే ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణతోనే ఈ కార్యక్రమానికి నాంది పలకాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ మీదుగా ఎన్టీఆర్‌ భవన్‌ వరకు భారీ ర్యాలీ, నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టారు. ఆ రోజున గ్రామగ్రామానా, వార్డు వార్డునా, ఇళ్లపై పార్టీ జెండా ఎగరేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలిపారు.

*రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు మాఫియా అడ్డాలుగా మారాయనిటీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైతం పోలీసు అధికారులపై హుకుం జారీ చేస్తున్నారనిదీనికి డీజీపీ సిగ్గు పడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శనివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో నల్లగొండవరంగల్‌ఖమ్మం జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలన రజాకార్లను తలపిస్తోందనిరాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తమ కార్యకర్తలను టార్గెట్‌ చేసి కేసులు బనాయిస్తున్నారన్నారు. నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా పోలీసు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు.

*రాష్ట్రానికి చెందిన ఐదు బిల్లులు రాజ్‌భవన్‌లో మూలనపడిపోయాయి. గవర్నర్‌ చల్లటి చూపుల కోసం అవి వేనోళ్ల ఎదురు చూస్తున్నాయి. తమకు గవర్నర్‌ ఎప్పుడు మోక్షం ప్రసాదిస్తారోనని వేచివున్నాయి. గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌లో ఐదు చట్టతీర్మానాలు పెండింగ్‌లో వున్నాయి. రాష్ట్ర శాసనసభలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త చట్టాలులేదా చట్ట సవరణలు చేస్తూ బిల్లులు దాఖలుచేస్తారు.. ఈ బిల్లును ఆమోదించిగవర్నర్‌ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం అవసరమైన బిల్లులను రాష్ట్రపతి దృష్టికి గవర్నర్‌ తీసుకెళతారు. అలా గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన ఐదు బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో మూలుగుతున్నాయి. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో వున్న బిల్లులివే.. ఫ పత్రాల రిజిస్ట్రేషన్‌ తమిళనాడు సవరణ చట్టం బిల్లుగత ఏడాది సెప్టెంబరు వ తేది శాసనసభలో ఆమోదించారు.