Movies

అదో పెద్ద సీక్రెట్‌..!

Auto Draft

‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంతో తెలుగునాట యువకుల హృదయాల్ని దోచుకుంది హెబ్బా పటేల్‌. అనంతరం ఆశించిన విజయాలు దక్కకపోయినా అవకాశాల పరంగా మాత్రం ఎప్పుడూ వెనకబడలేదు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది. మీ వయసెంతో తెలుసుకోవచ్చా అని ఓ అభిమాని ప్రశ్నించగా…నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. మీ సౌందర్య రహస్యమేమిటని అడగ్గా..‘అదో పెద్ద సీక్రెట్‌. అస్సలు బయట పెట్దొద్దనుకున్నా..కానీ చెప్పక తప్పడం లేదు. దేవుడు ప్రసాదించినది కొంత అయితే… డాక్టర్ల కృషి వల్ల సంపాదిచుకుంది మరికొంత..’ అని సీక్రెట్‌ బయటపెట్టింది. పెళ్లి విషయం తన చేతుల్లో లేదని, విధికే ఆ బాధ్యతను వదిలేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఏ విషయంలోనైనా తాను సంయమనం పాటిస్తానని..వేళకు భోజనం సిద్ధంగా లేకపోతే ఆపుకోలేని కోపమొస్తుందని చెప్పింది. తెలుగులో మంచి అవకాశాలొస్తున్నాయని హెబ్బాపటేల్‌ తెలిపింది.