DailyDose

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జయంతి నేడు

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జయంతి నేడు

బిస్మిల్లాఖాన్ మన దేశానికి చెందిన ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు. 2001 లో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్నతో సన్మానించింది – ఈ సన్మానమును పొందిన సాంప్రదాయక సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి.

బిస్మిల్లాఖాన్జ న్మస్థలం బీహారు లోని డుమ్రాన్ జిల్లాలో, బిరుంగ్ రౌట్ కి గలి అనే ప్రాంతం. ఆయన తండ్రి, పైగంబర్ ఖాన్. ఆయన పూర్వీకులు భోజ్‌పూర్ లోని నక్కర్‌ఖానాలోఆస్థాన సంగీత విద్వాంసులు. అతని తండ్రి డుమ్రాన్ లోని మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ విద్వాంసుడు. బిస్మిల్లాఖాన్ తన మామయైన కీ.శే. అలీ బక్ష్విలాయతు వద్ద శిక్షణను తీసుకొన్నాడు. ఆయన వారణాసివిశ్వనాథుని దేవాలయంలో షెహనాయ్ వాయించేవాడు.

బిస్మిల్లాఖాన్ సరస్వతీ దేవి భక్తుడు. గంగా తీరాన ఉన్న విశ్వనాథుని దేవాలయంలో ఎక్కువగా షెహనాయ్ వాయించేవాడు.

1937 లో కోల్‌కతా భారతీయ సంగీత సమ్మేళనం లో షెహనాయికి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఆయన తన కచేరీల నిచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు, షెహనాయీని ఆయనతో పాటే పూడ్చిపెట్టారు. ఆయనకు షెహనాయీతో అంతగా అనుబంధం వుండేది .
మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది అని ఆయన అనేవాడు. సంగీతానికి కులం లేదు అని ఆయన నిరూపించారు

భారత స్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లోఆయన ఢిల్లీలోని ఎర్రకోట లో వాద్య కచేరీ నిచ్చాడు. జనవరి 26, 1950భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆయన ఎర్రకోటలో కాఫి రాగాన్ని తన షెహనాయిపై ఆలపించాడు.

డా. రాజ్‌కుమార్ నటించిన సనాది అప్పన్న సినిమాలో బిస్మిల్లాఖాన్ షెహనాయి వాయించాడు.

గూంజ్ ఉఠీ షెహనాయ్ అనే సినిమాలో షెహనాయి ధ్వనిని అందించాడు.
ఆయన పొందిన
అవార్డులు, పురస్కారాలు

భారత రత్న ( 2001 )

ఫెలో ఆఫ్ సంగీత నాటక అకాడమి ( 1994 )

పద్మ విభూషణ్ ( 1980 )

పద్మ భూషణ్ ( 1968 )

పద్మశ్రీ ( 1961 )

సంగీత నాటక అకాడమి అవార్డు ( 1956 )

తాన్‌సేన్ అవార్డు

బనారస్ హిందూ యునివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్
విశ్వభారతి యునివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్
శాంతినికేతన్ నుండి గౌరవ డాక్టరేట్