DailyDose

పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్ధం- TNI నేర వార్తలు

పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్ధం- TNI నేర వార్తలు

*హైకోర్టు న్యాయ‌మూర్తులపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసుపై సోమ‌వారం నాడు ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ సంద‌ర్భంగా విదేశాల నుంచే జ‌డ్జీల‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌తో కూడిన పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టిన వైసీపీ ఎన్నారై విభాగం స‌భ్యుడు పంచ్ ప్ర‌భాక‌ర్ అరెస్ట్ ఎంత‌వ‌రకు వ‌చ్చిందని సీబీఐ అధికారుల‌ను హైకోర్టు ప్ర‌శ్నించింది. పంచ్ ప్ర‌భాక‌ర్‌ను అరెస్ట్ చేసే దిశ‌గా ఇప్ప‌టిదాకా ఏమేం చ‌ర్య‌లు తీసుకున్నార‌ని కోర్డు ప్ర‌శ్నించింది. కోర్టు ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన సీబీఐ అధికారులు.. పంచ్ ప్ర‌భాక‌ర్‌ను అరెస్ట్ చేసే దిశ‌గా ఇప్ప‌టికే చ‌ర్య‌లు ప్రారంభించామ‌ని, అందులో భాగంగా కేంద్ర హోం శాఖ‌తో పాటుగా విదేశాంగ శాఖ‌ల‌కు లేఖ‌లు రాశామ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు వ‌చ్చేందుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా సీబీఐ తెలిపింది. ఈలోగా జ‌డ్జీల‌పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా తొల‌గించాల‌ని సీబీఐ అధికారుల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.జియో బ్లాకింగ్ ఇంజెక్షన్‌ ఆర్డర్‌ను ఇచ్చే అంశంపై విచారణ చేపడతామన్న హైకోర్టు.. కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
* హైదరాబాద్ నుండి పాకిస్థాన్‌కు అక్రమంగా ‘‘ట్రమడాల్’’ డ్రగ్ ఎగుమతిని బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు అడ్డుకున్నారు. పటాన్‌చెరులోని లూసెంట్‌ డ్రగ్స్‌ కంపెనీ నుంచి రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు 2500 కిలోల మెడికల్‌ మత్తుమందు అక్రమ సరఫరా జరిగినట్లు గుర్తించిన ఎన్సీబీ… ట్రమడాల్‌ డ్రగ్‌ రవాణాను సీరియస్‌గా తీసుకుంది. అక్రమంగా మందులు సరఫరా చేసిన కంపెనీపై ఎన్సీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డెన్మార్క్, జర్మనీ, మలేషియాలకు డ్రగ్స్‌ పంపినట్లుగా ఇన్వాయిస్‌లు లభించాయి. లూసెంట్‌ డ్రగ్స్‌ కంపెనీ దొడ్డిదారిన పాకిస్తాన్‌కు డ్రగ్స్‌ పంపినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి లూసెంట్‌ డ్రగ్స్‌ కంపెనీ ఎండీతో పాటు నలుగురు ఉద్యోగులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు
*బందరులో కిడ్నాప్.. కరీంనగర్‌లో అఘాయిత్యం..
మచిలీపట్నం బందరులో కిడ్నాప్.. కరీంనగర్‌లో అత్యాచారం.. న్యాయం కోసం జిల్లా కలెక్టర్‌ని ఆశ్రయించిన బాధితురాలి తల్లి.. వివరాల్లోకి వెళితే.. మోకా జయలక్ష్మి మచిలీపట్నం ఉల్లింగిపాలెంకు చెందిన వివాహిత (మూగ, చెముడు). ఫిబ్రవరి 4న ఆమె అదృశ్యమైంది. మార్చి 9వ తేదీ వరకు ఆచూకీ తెలియలేదు. వంట పని కోసం ఉల్లింగపాలెంకు చెందిన కొంత మంది కరీంనగర్ తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 9న మహిళ ఫోన్ చేయటంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి తీసుకువచ్చారు. తనను నిర్భంధించి అత్యాచారం చేశారని చెప్పటంతో ఆమె తల్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గా భవాని డిమాండ్ చేశారు. దీన్ని మహిళల అక్రమ రవాణాగా తాము భావిస్తున్నామని ఆమె అన్నారు.
* గుంటూరు జిల్లాలోని తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒకే రోజు దారి దోపిడీ, చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. చెంచుపేట జెండా చెట్టు బజార్లో నడిచి వెళ్తున్న కొమ్మూరు శ్రీనును దుండగులు అడ్డగించి దారి దోపిడీకి యత్నించారు. పెద్దగా కేకలు వేయడంతో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు బైక్‌ని వదిలేసి పరారయ్యారు. అటు సీఎం కాలనీ కొబ్బరితోటల వద్ద తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగలగొట్టు దొంగలు చోరీకి తెగబడ్డారు. ఇంట్లో ఉన్న రూ.20 వేల విలువ గల టీవీ చోరీకి గురైంది. ఈ ఘటనలపై బాధితులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* మద్యానికి బానిసై కన్న కూతురిపైనే ఓ కసాయి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన అమానుష ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ చెరువు కట్ట కింద కాలనీలో నివాసముంటున్న రాము ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాముకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. మద్యానికి బానిసైన రాము.. కట్టుకున్న భార్యను కొట్టి వేధించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గత రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన తండ్రి … చిన్న కూతురిపై లైంగికంగా వేధింపులకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో… మరో ఇద్దరు కూతుర్లు రామును అడ్డుకొని స్థానికులకు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు బాలికను రక్షించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి రామును అరెస్ట్ చేశారు.
* నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో దారుణం జరిగింది. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థి జ్యోతిపై ప్రేమోన్మాది చెంచుకృష్ణ కత్తితో దాడి చేశాడు. జ్యోతి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. తనను ప్రేమించలేదని కోపంతో జ్యోతిపై చెంచుకృష్ణ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
*మేడ్చల్ జిల్లాలోని కీసర మండలం బోగరం బీసీ హాస్టల్‌లో పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఎనిమిదో తరగతి విద్యార్థి శివ శంకర్ (13)ను పాము కాటు వేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కొమిశెట్టి పల్లి గ్రామం,మర్పల్లి మండలం వికారాబాద్ జిల్లా. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో విద్యార్థి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
*హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి విధులు నిర్వహిస్తున్న ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ రోడ్డు దాతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. కాగా సీఐ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో సీఐ జహంగీర్ చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
*చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 133 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం కూలిపోయింది. నైరుతి చైనాలోని వూహో సిటీ సమీపంలోని పర్వతశ్రేణుల్లో సోమవారం విమానం కూలిపోయింది. ఇది బోయింగ్ 737 విమానం. చైనాలోని కున్మింగ్ నుంచి గ్వాంగో సిటీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.11 నిమిషాలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానానికి సంబంధించి 2.22 నిమిషాలకి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమాన ప్రమాదం జరిగిన పర్వత ప్రదేశంలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టింది. అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి, విమానంలోని ప్రయాణికులంతా మరణించే అవకాశాలున్నాయని అక్కడి మీడియా కథనం. విమాన ప్రయాణానికి సంబంధించి చైనా అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగి ఉంది. ఆ దేశంలో చివరి విమాన ప్రమాదం 2010లో జరిగింది.
*లక్షల్లో పేరుకు పోయిన అప్పులు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. శివమొగ్గ తాలూకా కుంచెనహళ్లి గ్రామానికి చెందిన లోకేశ్‌ నాయక్‌ (38), సుమిత్ర దంపతులు. లోకేశ్‌ పంటల కోసం సహకార బ్యాంకుతో పాటు ఇతరుల వద్ద రూ. లక్షల్లో అప్పులు తెచ్చాడు. పంట చేతికి రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దంపతులు తరచూ గొడవలు పడేవారు. శనివారం రాత్రి కూడా ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశంలో లోకేశ్‌ భార్యపై వేటకొడవలితో తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
*రంగస్థల కళాకారిణి దేవిపై యాసిడ్‌ దాడికి పాల్పడిన రమేశ్, స్వాతి, యోగేశ్‌ అనేవారిని నందిని లేఔట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నందినిలేఔట్‌ గణేశ్‌బ్లాక్‌లో ఉంటున్న దేవి బీఎంటీసీ కండక్టర్‌గా పనిచేసి రాజీనామా చేసింది. కొన్ని¬రోజుల నుంచి నాటక కళాకారిణిగా ప్ర¬ద¬ర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దేవిపై ముగ్గురూ యాసిడ్‌ దాడి చేసి పరారయ్యారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
*కల్లులో మత్తు కోసం వినియోగించే రూ.4 లక్షల విలువైన అల్ఫాజోలంను ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఎక్సైజ్‌ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. స్థానిక ఎక్సైజ్‌ సీఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖేడ్‌లో కల్లులో కలుపడానికి వినియోగించే అల్ఫాజోలం ఉన్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ లతీఫ్‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేయగా రూ.4 లక్షల విలువ చేసే 1.150 కిలోల అల్ఫాజోలం పట్టుబడింది. నిందితులు దాస్‌గౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌లను అరెస్టు చేసు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితులను సోమవారం స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
* వాకలపూడి శిల్పారామం వెనకాల సముద్రతీరంలో సారా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేసి 200 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నేమాం శివారు చుట్టుకొండపేటకు చెందిన పితాని రాజేష్‌, ఎల్లబోయిన నరేష్‌, కొప్పిశెట్టి నాని బీచ్‌లో నాటుసారా తయారు చేస్తూ ప్యాకింగ్‌ చేస్తుండగా ఆదివారం సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. పితాని రాజేష్‌ పోలీసులకు పట్టుబడగా మిగతా ఇద్దరూ పరారయ్యారు. సంఘటనా స్థలంలో 200 లీటర్ల నాటుసారా, తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేసినట్టు సీఐ మురళీకృష్ణ తెలిపారు.
*ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో మంది చిన్నారులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ వెల్లడించింది. మరో కి పైగా చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. రష్యా దాడి బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని పార్లమెంట్ ప్రకటించింది. గతరాత్రి ఖార్కివ్‌లో జరిగిన దాడిలో కూడా తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందాడు. కీవ్ నగరంలో రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో సాషా అనే తొమ్మిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను ఆసుత్రికి తీసుకెళ్లగాడాక్టర్లు ఆమె ఎడమచేయిని చాలా వరకు తొలగించారు. ఈ కాల్పుల్లో ఆమె తండ్రి కూడా మరణించాడు. సాషా కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరోవైపు ఆదివారం కూడా సూపర్‌సోనిక్ మిస్సైల్ ప్రయోగించినట్లు రష్యా ప్రకటించింది.
* ఏకంగా ఎస్సై పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచిన ఒక వ్యక్తి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు యువతులు. మహిళల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. మోసపోయినట్లు గ్రహించిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి బండారం వెలుగులోకి వచ్చింది. పర్వతగిరి పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వపరాలను మామునూరు ఏసీపీ నరే్‌షకుమార్‌ శనివారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా రాయచోటికి చెందిన ఎంకాల ఆంజనేయులు అలియాస్‌ అంజికి 2006లో వివాహం జరగగా ఇద్దరు పిల్లలున్నారు. అతడి భార్య ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి స్థిరపడింది. ఆంజనేయులుకు ఖర్చులకు డబ్బులు పంపించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు.
*కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం సంతెకుడ్లూరులో మరోసారి వైసీపీలో వర్గ విబేధాలు వెలుగుచూశాయి. హోలీ ఊరేగింపు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
*మదనపల్లెలో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల మృతితో మనస్థాపం చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవన్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది కరోనాతో ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ దొరక్క తండ్రి మృతి చెందారు. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలో తల్లి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు లేని లోటు భరించలేక తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ కుమార్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*అప్పుల బాధతో కృష్ణాజిల్లాలో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రిరాజుపాలెంకు చెంది న జొన్నల కోటిరెడ్డి (47) అర ఎకరం సొంత పొలంతోపాటు, నాలుగెకరాలు కౌలుకు సాగుచేస్తున్నాడు. రూ.10 లక్షల వరకు అప్పులుండటంతో శనివారం రాత్రి కలుపుమందు తాగాడు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం మృతిచెందాడు.
*తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఒక గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ద్రాక్షారామ ఎస్‌ఐ తులసీరామ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక ఇటీవల తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. వారి కుటుంబానికి తెలిసిన అదే గ్రామానికి చెందిన సత్యవాడ సత్యనారాయణ(19) ఆదివారం సాయంత్రం బాలికకు చిరుతిండ్లు కొని ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయిన బాలికను వారి ఇంటి సమీపంలో వదిలివేశాడు. అనంతరం బాలికను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా, రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్రాక్షారామ పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు.
*హోలీ పర్వదిన వేళ ముష్కర మూకలు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. మైనారిటీ హిందూ భక్తులపై ర్యాజికల్ ముస్లింలు ఈ దాడి జరిపినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ దాడిలో ముగ్గురు భక్తులు గాయపడినట్టు చెబుతున్నారు. ఇస్కాన్‌ రాధాకాంత ఆలయంలో 17వ తేదీన దాడి జరగగా, 48 గంటల తర్వాత కూడా ఢాకా పోలీసులు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదనీ ప్రత్యక్ష సాక్షి రస్మణి కేశవదాసు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తక్షణం ఈ దాడిపై చర్య తీసుకోవాలని, తరచు దాడులకు టార్గెట్‌గా మారుతున్న ఢాకాలోని మైనారిటీ హిందువులు, ఇస్కాన్ ఆలయాలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
*పైన ఆలుగడ్డ బస్తాలు.. లోపల గంజాయి మూటలు.. ఒడిషాలోని చిత్రకొండ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రలోని అమరావతికి రహస్యంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట ను సైబరాబాద్‌ పోలీసులు కట్టించారు. ముగ్గురు నిందితుల ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి 560 కేజీల గంజాయి, ఒక డీసీఎం, ఒక కారు, 3 మొబైల్స్‌ స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.3 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర శనివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన నౌషద్‌ 1000 కేజీల గంజాయి ఇవ్వాలంటూ చిత్రకొండ ఏజెన్సీకి చెందిన సంతోష్‌ రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. మహారాష్ట్ర నుంచి కారులో వెళ్లిన నౌషద్‌ అనుచరులు భద్రాచలంలో 300 కేజీల ఆలుగడ్డలు లోడ్‌ చేసుకొని చిత్రకొండలో సంతోష్‌ వద్ద నుంచి 560 కేజీల (280 కేజీల చొప్పున రెండు మూటలు) గంజాయిని లోడ్‌ చేసుకున్నారు. దాన్ని ఆలుగడ్డల మధ్యలో ఉంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు వెళ్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులు సలీముల్లా, షేక్‌ రెహాన్‌, షేక్‌ వహీంలను అరెస్టు చేశారు.
*హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారులోని యువకులు సురక్షితంగా బయటపడ్డారు.