NRI-NRT

సింగపూర్ ప్రవాసుల రక్తదానం

సింగపూర్ ప్రవాసుల రక్తదానం

సింగపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో 2022,మార్చ్ 13,20 తేదీల్లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం

సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ నెల 13 మరియు 20 వ తారీఖుల్లో స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. కరోనా సమయంలో తెలుగు సమాజం వరసగా 8వ సారి విజయవంతంగా నిర్వహించడం విశేషం.

ఈ కార్యక్రమానికి అత్యద్భుతస్పందన వచ్చినప్పటికీ కోవిడ్-19 సురక్షిత చర్యలలో భాగంగా రోజుకి 20 మందికి గానూ,రెండు రోజులకి దాదాపు 40 మందికి మాత్రమే అవకాశం కల్పించడం జరిగిందని, కరోనా వాక్సిన్ తీసుకున్న వారికి కాల పరిమితి నిబంధనలు ఉండటం వల్ల చాలామంది రక్తదానం చేయలేకపోయారు. వారు రక్తదానం చేయదలచిన ఇతర దాతలు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవలసినదని నిర్వాహకులు సోమ రవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, రెడ్ క్రాస్ మరియు బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.*

టేకూరి నగేష్,కురిచేటి జ్యోతీశ్వర్,జూనెబోయిన అర్జునరావు లు నిర్వాహకులు సోమ రవికి రెండు రోజులూ సహకారం అందించారు.