NRI-NRT

డల్లాస్‌లో నాట్స్ తెలుగు సంబరాల సందడి

డల్లాస్‌లో నాట్స్ తెలుగు సంబరాల సందడి - NATS Mini Telugu Sambaralu 2022 In Dallas

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మినీ తెలుగు సంబరాలు శనివారం నాడు అర్వింగ్‌లోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల పరిచయ కార్యక్రమాన్ని(బ్యాంక్వెట్) శుక్రవారం నాడు అర్వింగ్‌లోని SLPS కన్వెన్షన్ సెంటరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీనటీనటులు రవి, మెహ్రీన్, పూజా ఝవేరి, సియా గౌతం, సంగీత దర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ అధ్యక్షుడు అన్నే విజయశేఖర్, ఛైర్మన్ అప్పసాని శ్రీధర్, నాట్స్ ప్రతినిధులు గుత్తికొండ శ్రీనివాస్, చాగంటి రంజిత్, డా.మధు కొర్రపాటి, గంటి అరుణ, మంచికలపూడి శ్రీనివాస్, మన్నవ మోహనకృష్ణ, పిన్నమనేని ప్రశాంత్, శ్యామ్, మందాడి శ్రీహరి, కిషోర్ కంచర్ల, ఆది గెల్లి, వీణా యలమంచిలి, మురళీ మేడిచెర్ల, బాపు నూతి, వంశీ వెనిగళ్ల, తెదేపా నేతలు ముళ్లపూడి బాపిరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, డల్లాస్ ప్రవాసులు డా.నల్లూరి ప్రసాద్, పోలవరపు శ్రీకాంత్, అనంత్ మల్లవరపు, కేసీ చేకూరి, కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, చంద్రారెడ్డి పోలీస్, ఉప్పు వినోద్, మండువ సురేష్, ఆత్మచరణ్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రవాస బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శనివారం మధ్యాహ్నం 2గంటల నుండి టయోట మ్యూజిక్ ఫ్యాక్టరీలో వేడుకలు ప్రారంభమవుతాయి. సంగీత దర్శకుడు కోటి విభావరి కూడా ఇందులో భాగంగా నిర్వహించనున్నారు.