Movies

బ్యూటీ సీక్రెట్‌ చెప్పేసింది

Auto Draft

అందం, అభినయంతో మెప్పించగల నాయిక అదితీరావ్‌ హైదరీ. సీజనల్‌గా తెలుగు తెరపై సందడి చేస్తుంటుంది ఈ హైదరాబాదీ భామ. ‘చెలియా’, ‘వీ’, ‘మహా సముద్రం’ వంటి చిత్రాలు ఆమెను మన ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఎప్పుడు కనిపించినా మెరిసే రంగుతో ఆకట్టుకునే అదితీ..తన బ్యూటీ సీక్రెట్‌ ఏంటో చెప్పేసింది. సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తుల వాడకమే తన అందానికి కారణమని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…‘షూటింగ్‌ లేనప్పుడు అస్సలు మేకప్‌ వేసుకోను. బయటకు వెళ్తే కాటుక, లిప్‌స్టిక్‌ మాత్రమే పెట్టుకుంటాను. సెల్ఫీలకు, ఫొటోలకు ఫిల్టర్స్‌ వాడటం ఇష్టము ఉండదు. షూటింగ్‌ నుంచి తిరిగొచ్చాక రాత్రి నిద్రపోయేప్పుడు తప్పనిసరిగా మేకప్‌ తీసేస్తా. ఎంత అలసిపోయినా సరే ఇది మర్చిపోను. ఇంట్లో తయారు చేసిన బ్యూటీ ఆయిల్స్‌ రాసుకుంటా. దీంతో నా చర్మం మెరుస్తుంది’ అని చెప్పింది. ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రం ‘హే సినామిక’ తెరపైకి వచ్చింది