Food

వేడి నుంచి ఉపశమనానికి చెరుకురసం

వేడి నుంచి ఉపశమనానికి చెరుకురసం

ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ విరివిగా వాడుకలో ఉన్న పానీయం చెరకురసం. భారత ఉపఖండం, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో చెరకురసం విరివిగా దొరుకుతుంది. ఈ ప్రాంతాల్లో వేసవిలో చెరకురసం వినియోగం మరింత ఎక్కువగా ఉన్నాయి.చెరకురసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అయితే, చెరకురసం తీసే యంత్రం శుభ్రత, చెరకురసం అమ్మేచోట ఉన్న పరిసరాల శుభ్రత వంటివి కాస్త గమనించి తీసుకోవడం మంచిది.

***చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
చక్కెర ఎక్కువగా ఉండే చెరకురసం ఇట్టే సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. జాగ్రత్తలు తీసుకోకుండా, చెరకురసం తీసుకుంటే లేనిపోని వ్యాధుల బారినపడే ప్రమాదం లేకపోలేదు. చాలాచోట్ల చెరకురసం తీసేటప్పుడు అల్లం, నిమ్మకాయ, పుదీనా వంటివి కూడా కలిపి చెరకును నలగ్గొడతారు. వీటివల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. చెరకురసం తక్షణ శక్తిని, ఎండతాకిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.చెరకు రసంలోని క్యాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుంది. ఇందులోని ఎంజైమ్స్‌ జీర్ణకోశంలోని సమతుల్యతను కాపాడి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.తియ్యని రుచి కోసం రసాయనాలతో కూడిన కూల్‌డ్రింకుల కంటే సహజమైన తీపితో కూడిన చెరకురసం తీసుకోవడమే మేలు