Movies

ఇలా కనిపించడం ఈజీనా?

Auto Draft

కొంతమంది కథానాయికలు అందంతో ఆకట్టుకుంటారు. ఇంకొంతమంది అభినయాన్ని నమ్ముకుంటారు. అందం, అభినయం… రెండూ అరుదుగా కనిపించే కాంబినేషన్‌. అలాంటి వాళ్లే చిత్రసీమలో రాణిస్తారు. అయితే కేవలం గ్లామర్‌ని నమ్ముకుని నెట్టుకువచ్చేస్తున్న వాళ్లూ ఉంటారు. ప్రగ్యా జైస్వాల్‌ ఈ జాబితాలో చేరే పేరు. తనపై గ్లామర్‌ డాల్‌ అనే ముద్ర ఎప్పుడో పడిపోయింది. అయితే… అలా పిలిపించుకోవడం కూడా అంత సులభం కాదని, చాలా అదృష్టం ఉండాలని అంటున్నారామె. ‘‘గ్లామర్‌ డాల్‌ అనే పిలుపు కచ్చితంగా ప్లస్‌ పాయింటే. దాన్ని ఎవరూ తక్కువ చేసి చూడొద్దు. ప్రతీ సినిమాలోనూ అందంగా కనిపించడం కోసం మేం చాలా కసరత్తులు చేస్తుంటాం. సినిమా అనేది రంగుల ప్రపంచం. అలాంటప్పుడు గ్లామర్‌గా కనిపించడం నేరమెందుకు అవుతుంది? అలాగని నేనెప్పుడూ నటనని అశ్రద్ధ చేయలేదు. నటించే అవకాశం ఎప్పుడొచ్చినా వదులుకోలేదు. ‘కంచె’లో కొన్ని భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు కచ్చితంగా అందులోనూ నాదైన ముద్ర వేయగలను’’ అని ధీమాగా చెప్పుకొచ్చారు.