NRI-NRT

మార్చి 27న డాలస్ లో ‘నాటా’ మహిళా దినోత్సవ వేడుకలు

మార్చి 27న డాలస్ లో ‘నాటా’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళ ఒక అమ్మగా జన్మనిస్తుంది. ఒక భార్యగా బాధ్యతలను మోస్తూ, ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుంద. ఒక చెల్లిగా స్నేహాన్ని,చిలిపి అల్లర్లను పరిచయం చేస్తుంది. ఒక కుతురిగా ప్రేమను పంచుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒకచోట తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. పుట్టినప్పట్టి నుంచి ప్రాణం పోయే వరకు తానంటేనే సేవ అనేలా ప్రతి ఒక్క విషయంలో పురుషులకు తోడు నిలుస్తుంటారు స్త్రీలు.ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో, అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి మహిళలందరిని సత్కరించుకోవటం మన బాధ్యత అంటూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ వారు మార్చి 27న డాలస్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.