Movies

ఇకపై ఆ భాద్యత నాదే ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన

ఇకపై ఆ భాద్యత నాదే ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్‌ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(అప్పు) సేవల తన ఫౌండేషన్‌ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందం ఉంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ముందుకు తీసుకేళ్లబోతున్నాను.త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాను’ అంటూ అప్పు ఫొటోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ‘అప్పు ఎక్స్‌ప్రెస్‌’ అని రాసి ఉన్న ఈ పోస్ట్‌ను ఆయన పంచుకున్నారు. ఆయన ట్వీట్‌పై పునీత్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌పై ప్రశంసలు కురిపిస్తు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. కాగా ప్రకాశ్‌ రాజ్‌ లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సేవలు అందించారు. తన ఫాంహౌజ్‌లో నిరాశ్రయులకు ఆయన ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే.