Movies

పాన్‌ ఇండియాకే ఓటు

Auto Draft

జాన్వీకపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడు? ఈ ప్రశ్న రెండేళ్లుగా ఎదురవుతూనే ఉంది. జాన్వీ తెలుగు సినిమాలో నటించడానికి రంగం సిద్ధమవుతోందని చెబుతూనే ఉన్నారు. ఎన్టీఆర్‌ సినిమాలో ఖాయమైందని, మహేష్‌ సినిమా ఒప్పుకొందని ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల బోనీకపూర్‌ కూడా ‘జాన్వీకి తెలుగు సినిమాలంటే ఇష్టం.. తాను త్వరలోనే తెలుగు సినిమాలో కనిపిస్తుంద’ని హింట్‌ ఇచ్చారు. అయితే అదెప్పుడన్నది ఇంకా తేలలేదు. కాకపోతే.. జాన్వీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తను సినిమాల్ని ఆచితూచి ఎంచుకొంటోంది. సినిమాల విషయంపై తనకంటూ ఓ స్పష్టత ఉంది. ప్రస్తుతం తన గురి పాన్‌ ఇండియా సినిమాలపై ఉందట. ‘‘పాన్‌ ఇండియా అయితే అన్ని భాషలకూ చేరువ కావొచ్చు. నాలుగైదు సినిమాలు చేసినా రాని గుర్తింపు, ఒక్క సినిమాతో దక్కించుకోవచ్చు. పైగా భారీ పారితోషికం కూడా డిమాండ్‌ చేయొచ్చు’’ అంటోందట జాన్వీ. శ్రీదేవి కూడా పాన్‌ ఇండియా స్టారే. అన్ని భాషల్లోనూ ఆమె సినిమాలు చేశారు. దేశమంతా ఆమెకు అభిమానులు ఉన్నారు. జాన్వీ కూడా తల్లి బాటలోనే అడుగులు వేయాలనుకుంటోందేమో..?