DailyDose

చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య -TNI నేర వార్తలు

చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య -TNI నేర వార్తలు

*చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో మహిళ దారుణ హత్యకు గురైంది. కొంగవారిపల్లికి చెందిన గాజుల వ్యాపారం చేసుకునే కే.రమణమ్మ(37)గా గుర్తించారు. ఇంటి స్థల వివాదం, ఆర్థిక పరమైన లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రమణమ్మను హత్య చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన రమణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు ముగ్గురు కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది
*ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్‌లో ఆంజనేయులు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెల్లెలు వరుసయ్యే యువతిని ఆంజనేయులు ఇంటి నుండి తీసుకుని పరారయ్యాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్‌లో బంధువులు మందలించడంతో అవమానంగా భావించిన ఆంజనేయులు గొంతుకు టవల్ బిగించుకున్నాడు. కానిస్టేబుల్ గుర్తించడంతో చికిత్స కోసం యువకుడిని ఒంగోలు కిమ్స్‌కు తరలించారు
*రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాల్ రెడ్డి ఇంట్లో కురుబ పార్వతి అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత కొంత కాలంగా గోపాల్ రెడ్డి ఇంట్లో బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామానికి చెందిన భార్యాభర్తలు హనుమంతరాయుడుకురుబ పార్వతి పనిచేస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హనుమంత రాయుడు స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి పార్వతి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కనిపించింది. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు లారీలు పరసస్పరం ఢీకొన్నాయి. లారీల మధ్యలో ఓ కారు నుజ్జు నుజ్జు అయింది. మరోవైపు ఒక వ్యాన్లో నుంచి పాస్పరస్ డైక్లోరైడ్ ద్రావణం లీక్ అవుతోంది. ద్రావణం నుండి ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.
*కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు సమీపంలోని గార్గేయపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒకరికి గాయాలయ్యాయి. మృతులను నందికొట్కూరు నియెజకవర్గం వీపనగండ్లకు చెందిన బాష‌, స్వాములుగా గుర్తించారు. ముగ్గురు స్నేహితులు కర్నూలు నుంచి వీపనగండ్లకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*మదురై వండియూర్‌ తెప్పకుళం మారియమ్మన్‌ ఆలయ వేడుకల్లో భాగంగా గురువారం సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శనలో భరత నాట్య కళాకారుడు కాళిదాస్‌ తన కుమార్తె, శిష్యులతో ‘సంగమం’ చిత్రంలోని ‘ఎల్లాం వల్ల తాయే…’ అనే పాటకు నృత్యం చేస్తున్నారు. ఆ పాటలో లాగే నృత్యం మధ్యలో కాళిదాస్‌ కుర్చీలో కూర్చున్నాడు. అనంతరం మిగిలిన వారు నృత్యం కొనసాగించారు. నృత్యం ముగిసిన తర్వాత కూడా కాళిదాస్‌ కుర్చీలో అచేతనంగా పడి ఉండడం గమనించిన ఆయన కుమార్తె, శిష్యులు, నిర్వాహకులు నిఠ్ఘాంతపోయి, అతడిని పరి శీలించి మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘట నతో వైభవంగా జరుగుతున్న ఆలయ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భరతనాట్యం అంటే మక్కువ కలిగిన 54 ఏళ్ల కాళిదాస్‌ బాల్యం నుండే నృత్య ప్రదర్శనలు చేస్తున్నాడు. ప్రస్తుతం భరతనాట్య శిక్షణ పాఠశాల నడుపుతున్న కాళిదాసు భార్య కర్ణాటక సంగీత ఉపాధ్యాయురాలు కాగా, కుమారుడు మృదంగం విద్వాంసుడు, కుమార్తె భరత నాట్య కళాకారిణి. ఇప్పటికే పలు పురస్కారాలు, 1,000కి పైగా జ్ఞాపికలు అందుకున్న కాళిదాస్‌, కొద్దికాలంలో రాష్ట్రప్రభుత్వం నుంచి ‘కలైమా మణి’ పురస్కారం అందుకుంటానని గర్వంగా తెలిపేవాడని ఆయన స్నేహితులు విషాదంగా తెలిపారు.
*ముత్యాల వ్యాపారం పేరుతో రాజమండ్రిలో పెరల్స్ వరల్డ్ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. మహిళలను లూటీ చేసి సంస్థ బోర్డు తిప్పేసింది. తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేటలో ఆరు నెలల క్రితం పెరల్స్ వరల్డ్ సంస్థ వెలసింది. మహిళలకు ముత్యాల దండ కడితే రూ.250 రూపాయలు ఇస్తామంటూ నమ్మించిన సంస్థ డిపాజిట్ల సేకరించింది. రాజమండ్రిలో సుమారు 100 మంది వరకు మహిళలు పెరల్స్ వరల్డ్ సంస్థలో రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల చొప్పున సుమారు రెండు కోట్ల వరకు డిపాజిట్లు చేశారు. అయితే గత మూడు రోజులుగా పెరల్స్ వరల్డ్ ఆఫీస్ మూతబడి ఉంది. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పెరల్స్ ఆఫీస్ యజమాని రవి కుమార్ పరారీలో ఉన్నాడు.
*రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాల్ రెడ్డి ఇంట్లో కురుబ పార్వతి అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత కొంత కాలంగా గోపాల్ రెడ్డి ఇంట్లో బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామానికి చెందిన భార్యాభర్తలు హనుమంతరాయుడు, కురుబ పార్వతి పనిచేస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హనుమంత రాయుడు స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి పార్వతి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కనిపించింది. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీపీ అమ్ములమ్మ కుమారుడు లక్ష్మిరెడ్డిపై దాడి చేశారని కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితమే టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. గురువారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అరెస్ట్ అయిన వారిలో గురజాల నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గడిపూడి శ్రీకాంత్ ఉన్నారు.
*తాను పనిచేస్తున్న ఫ్లైఓవర్‌ పై పడుకుని నిద్రలో కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ప్రమోద్‌ తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్‌కు చెందిన మకుత్రమ్‌ సిదర్‌ (40) నగరానికి వలస వచ్చి గచ్చిబౌలిలోని బాబూఖాన్‌ ఎస్టేట్‌ వద్ద ఎంవీఆర్‌ కనస్ట్రక్షన్‌కు చెందిన ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ పైకి ఎక్కి పడుకున్నాడు. నిద్రలో జారి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు చంద్రమని సిదర్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికిచేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
*రామగుండం ఏరియా వర్కుషాపులో స్వప్న అనే మహిళ ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. అయితే తనను వేధిస్తున్నాడని స్వామిదాస్ పై ఆరోపణలు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన స్వామిదాస్ గురువారం రాత్రి స్వప్న ఇంటికి వెళ్లి తన అనుచరులతో స్వప్నపై దాడి చేయించాడు. దాడి అనంతరం మహిళ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే స్వప్న దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* ఇంట్లోని బాత్‌రూం శుభ్రంగా ఉంచలేదన్న విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొంది. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ శంకర్‌ వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన దాసరి శృతి(28), నవీన్‌ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరు కూకట్‌పల్లి న్యూ బాలాజీనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఆరేళ్లు, ఏడాదిన్నర వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మంగళవారం సాయంత్రం డ్యూటీనుంచి ఇంటికి వచ్చిన నవీన్‌ బాత్‌రూంలో మూత్రవిసర్జనకు వెళ్లి నీళ్లు సరిగ్గా పోయలేదు.
*యాదాద్రి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారం దర్గా వద్ద సత్తుపల్లి డిపో వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కండక్టర్ కాళ్లు విరిగిపోగా.. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ట్యాంకర్ నుండి లీక్ పామాయిల్ నూనె అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
*చిత్తూరులోని జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ గోవిందస్వామి (40) ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపిన ప్రకారం.. పలమనేరు మండలం గొబ్బిళ్ళకోటూరుకు చెందిన గోవిందస్వామికి వివాహమైంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు విడిపోయారు. ఇతడికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణ ఉంది. గతేడాది ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో దానికి కారణం గోవిందస్వామి అని పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది మార్చి 18 నుంచి జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. తనకు బెయిల్‌ తీసివ్వడానికి ఎవరూ రాలేదనే మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని సూపరింటెండెంట్‌ అన్నారు. స్నానపుగదిలో గురువారం మధ్యాహ్నం లుంగీతో ఉరేసుకున్నాడన్నారు. వెంటనే గమనించి అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందతూ సాయంత్రం మరణించాడని, ఈమేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
*చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ అటవీ ప్రాంతంలో 11 మంది కోడి పందెం రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.58 వేల నగదు, నాలుగు కోళ్లు, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. పనపాకం పంచాయతీలోని అంబేడ్కర్‌ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడి పందేలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ విజయకుమార్‌ నాయక్‌ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. 11 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారు తిరుపతి, పూతలపట్టు, కుక్కలదొడ్డిలకు చెందిన వారుగా గుర్తించారు. వెంకటేష్‌ (వంకాయలోడు), బాబు, చెర్లోపల్లెకు చెందిన మధులతో మరి కొంతమంది పారిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈదాడుల్లో కానిస్టేబుళ్లు ధనంజయనాయుడు, యోగానంద, లోక, జయచంద్రనాయుడు, బాష తదితరులు పాల్గొన్నారు.
*చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ అటవీ ప్రాంతంలో 11 మంది కోడి పందెం రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.58 వేల నగదు, నాలుగు కోళ్లు, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. పనపాకం పంచాయతీలోని అంబేడ్కర్‌ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడి పందేలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ విజయకుమార్‌ నాయక్‌ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. 11 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారు తిరుపతి, పూతలపట్టు, కుక్కలదొడ్డిలకు చెందిన వారుగా గుర్తించారు. వెంకటేష్‌ (వంకాయలోడు), బాబు, చెర్లోపల్లెకు చెందిన మధులతో మరి కొంతమంది పారిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈదాడుల్లో కానిస్టేబుళ్లు ధనంజయనాయుడు, యోగానంద, లోక, జయచంద్రనాయుడు, బాష తదితరులు పాల్గొన్నారు.
*కోహీర్‌ మండలంలోని ఖానాపూర్‌ గ్రామంలో ఓ మహిళ సర్పంచ్‌ కుమారుడి కారుతో పాటు ఒక బైక్‌ను పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఖానాపూర్‌ గ్రామానికి చెందిన మహిళ తన వ్యవసాయ భూమికి సంబంధించిన పంచాయితీలో గ్రామ పెద్దలు సరైన న్యాయం చేయలేదని ఆగ్రహంతో ఉన్నది. దీంతో గ్రామానికి చెందిన పెద్దతోట రాచయ్యకు చెందిన కొత్త కారుతో పాటు, బర్ల నర్సింహులుకు చెందిన ప్యాషన్‌ప్లస్‌ బైక్‌ను ఆమె పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. ఈ సంఘటనలో కారు ముందు భాగం కాలిపోగా, బైక్‌ పూర్తిగా కాలిపోయింది. గ్రామ పెద్దలతో పాటు బాధితులు బుధవారం కోహీర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పోలీ్‌సస్టేషన్‌కు రప్పించగా మతిస్థిమితం లేనట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.
*బావ అయిన వ్యక్తి ప్రే మించి.. పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి పో లీసుస్టేషన్‌లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నవీపేట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. నవీపేటకు చెందిన తోకల పిం కి, బోధన్‌ మండలం హనుమాన్‌ టెకిడికి చెంది న మేకల ప్రేమ్‌ వరుసకు బావ కాగా, ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత నెల చివరి వారంలో ప్రేమ్‌ పింకి పెళ్లి చేసుకుంటాన ని చెప్పి కోటగిరి మండలం పొతంగల్‌కు తీసుకె ళ్లి ఐదు రోజుల పాటు అక్కడే ఉండగా, పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావడంతో ఈనెల మూ డో తేదీన నవీపేటలో వదిలేశాడు.
*హుజురాబాద్-వరంగల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు తాడి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పాడి రాజిరెడ్డి రిటైర్డ్ ఎస్సైగా పోలీసులు గుర్తించారు. రాజిరెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా నర్సక్కపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*ఎగివ అహోబిలం అటవీ ప్రాంతంలో ఇద్దరు దంపతులు అదృశ్యమయ్యారు. అహోబిలం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జంట గత రెండు రోజులు ఆచూకీ దొరకడం లేదు. దీంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కింద పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*రైలు ముందు దూకి ఆత్మహత్యా యత్నానికి యత్నించిన యువకుడిని ఓ రైల్వే పోలీసు కాపాడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగుచూసింది.థానే జిల్లా విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన 18 ఏళ్ల యువకుడిని ప్రభుత్వ రైల్వే పోలీసు కానిస్టేబుల్ రక్షించారు. పోలీసు కానిస్టేబుల్ చూపిన సాహసం ఇంటర్నెట్‌లో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్ధేశంతో మదురై ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన యువకుడు రైలు వచ్చే ముందు రైలు పట్టాలపైకి దూకాడు.
*సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో మృతదేహాలను అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రి మార్చురీ నుంచి శంషాబాద్‌కు మృతదేహాలను తరలించారు. ప్రస్తుతం 6 మృతదేహాల తరలింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మృతదేహాలను పాట్నాకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌ ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను చేరుకోనున్నాయి. మరికొద్దిసేపట్లో మరో 5 మృతదేహాలను ఎయిర్‌పోర్ట్‌కు తరలించనున్నారు. బోయగూడ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. 11మంది కార్మికుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి అయ్యింది.
*కోహీర్‌ మండలంలోని ఖానాపూర్‌ గ్రామంలో ఓ మహిళ సర్పంచ్‌ కుమారుడి కారుతో పాటు ఒక బైక్‌ను పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఖానాపూర్‌ గ్రామానికి చెందిన మహిళ తన వ్యవసాయ భూమికి సంబంధించిన పంచాయితీలో గ్రామ పెద్దలు సరైన న్యాయం చేయలేదని ఆగ్రహంతో ఉన్నది. దీంతో గ్రామానికి చెందిన పెద్దతోట రాచయ్యకు చెందిన కొత్త కారుతో పాటు, బర్ల నర్సింహులుకు చెందిన ప్యాషన్‌ప్లస్‌ బైక్‌ను ఆమె పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. ఈ సంఘటనలో కారు ముందు భాగం కాలిపోగా, బైక్‌ పూర్తిగా కాలిపోయింది. గ్రామ పెద్దలతో పాటు బాధితులు బుధవారం కోహీర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పోలీ్‌సస్టేషన్‌కు రప్పించగా మతిస్థిమితం లేనట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది
*అమలాపురం పార్కు రోడ్డులోని వినాయకుని ఆలయం సమీపంలో ఉన్న శ్రీరా మాంజనేయ జ్యువెలరీ షాపులో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మంగళవారం సెలవు అయినప్పటికీ షాపులో పని ముగించుకుని రాత్రి తాళాలు వేసుకుని షాపు యాజమాని పొట్టుపోతు వీరవెంకటదుర్గారావు ఇంటికి వెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో షాపు షట్టర్లు తెరిచి ఉన్నాయని షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. రూ.30వేలు విలువైన వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు అపహరణకు గురైనట్టు అతడు ఫిర్యాదు చేశాడు. బుధవారం పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు.
*మాయమాటలతో తోటి ఉపాధ్యాయురాలిని కారులో ఎక్కించుకున్న ఓ ఉపాధ్యాయుడు తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బి.కిషోర్‌.. ఖమ్మంలో నివసిస్తున్నాడు. ఆయన భార్య కూడా గార్ల మండంలోని మరో పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఇద్దరూ రోజూ కారులో విధులకు వెళ్లి వస్తుంటారు. తన భార్యకు పరిచయమున్న మరో ఉపాధ్యాయురాలు ఖమ్మం నుంచి రైల్లో తాను పని చేసే పాఠశాలకు రోజూ వెళ్లి వస్తుంటుంది.