Movies

హాలీవుడ్‌ అవకాశం వద్దంటానా?

హాలీవుడ్‌ అవకాశం వద్దంటానా?

హాలీవుడ్‌లో నటించే అవకాశమొస్తే ఎవరు కాదంటారు అని అంటోంది బాలీవుడ్‌ తార స్వర భాసర్‌. ఇటీవల ప్రియాంక చోప్రాతో కలిసి ప్రీ ఆసార్‌ ఈవెంట్‌లో పాల్గొన్నదీ నాయిక. ఈ వేదికపై నుంచి ఆసారం గొప్పదనం, అందులో ఆసియా సినిమాల భాగస్వామ్యం గురించి చెప్పి వీక్షకులను ఆకట్టుకుంది. తానొక హీరోయిన్‌ అయినందున ఈ కార్యక్రమానికి వచ్చిన నాయికల్లో ఎవరికి ఆసార్‌ అవార్డ్‌ వచ్చినా తనకొచ్చినట్లే భావిస్తానని చెప్పింది. ‘రాన్‌జానా’ సినిమా ఘన విజయంతో గుర్తింపు తెచ్చుకున్న స్వర భాసర్‌…‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’, ‘వీర్‌ దె వెడ్డింగ్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో పేరున్న నాయిక అయ్యింది. ఇటీవల ప్రీ ఆసార్‌ ఈవెంట్‌లో పాల్గొన్న స్వర భాసర్‌ మాట్లాడుతూ…‘ఆసార్‌ ఒక ప్రతిష్టాత్మక పురసారం. ఇకడ చాలా మంది ఆసియా నటీనటులు, సాంకేతిక నిపుణులు కనిపిస్తుండటం సంతోషంగా ఉంది. వీళ్లను చూస్తుంటే అంతర్జాతీయంగా మన సినిమా ఖ్యాతి పెరిగింది అనిపిస్తున్నది. మన రచయితలు కొత్తగా ఆలోచిస్తుండటం వల్లే విభిన్నమైన చిత్రాలు ప్రపంచ వేదిక మీదకు వస్తున్నాయి. హాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే ఎలా వదులుకుంటాను. కథ, పాత్ర నచ్చితే ఏ భాషలో నటించేందుకైనా సిద్ధమే’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘జహాన్‌ చార్‌ యార్‌’ అనే చిత్రంలో నటిస్తున్నది.