DailyDose

‘కథకళి’తో అదరగొట్టిన కలెక్టర్​

‘కథకళి’తో అదరగొట్టిన కలెక్టర్​

ఓ వైపు కలెక్టర్​గా విధులు నిర్వర్తిస్తూనే నాట్యంలో తన ప్రతిభను కనబరుస్తున్నారు కేరళలోని వయనాడ్​ కలెక్టర్ ఏ గీత. వయనాడ్​లో శనివారం నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో కథకళి నాట్యంలో అరంగేట్రం చేశారు. తన పాఠశాల స్థాయి నుంచే చాలా వేదికల మీద నృత్య ప్రదర్శనలు చేసినా.. కథకళిలో ప్రదర్శన చేయాలని కోరిక ఉండేది. శనివారంతో ఆ కోరిక తీరిపోయినట్లు తెలిపారు కలెక్టర్. గత సెప్టెంబర్​లో జిల్లా కలెక్టర్​గా వచ్చిన గీత.. ఓ వివాహ వేడుకలో నృత్య ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.