Movies

తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి

తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి

ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా, అన్నింట్లోనూ గ్లామర్‌ నాయికగానే కనిపించారు సోనాల్‌ చౌహాన్‌. ప్రతీసారి తన అందచందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం సోనాల్‌ బండి నెమ్మదించింది. సరైన అవకాశాలు రావడం లేదు. అయితే తన కెరీర్‌ ఇంకా అయిపోలేదని, చేయాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయని, ఏ క్షణంలో అయినా, తన సినీ జీవితం మలుపు తిరగొచ్చని నమ్ముతున్నారు సోనాల్‌. ‘‘ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’లో నటిస్తున్నా. ఈ సినిమాతో మళ్లీ నా కెరీర్‌కు మంచి ఊపొస్తుందని నమ్మకం ఉంది.  చిత్రసీమలో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఎలాంటి అవకాశమైనా రావొచ్చు. నేనూ వాటి కోసమే ఎదురు చూస్తున్నా. ప్రేక్షకులకు ఎప్పుడూ టచ్‌లో ఉండాలన్న రూల్‌ లేదు. కాస్త ఆలస్యమైనా మంచి సినిమాలతో, మంచి పాత్రలతో వస్తే ఆదరిస్తారు. ఇప్పుడు ఓటీటీల రూపంలో చాలా అవకాశాలున్నాయి. తెరపై కనిపిస్తే చాలు అనుకుంటే అందుకు లోటు లేదు. నేను మాత్రం నా స్థానాన్ని నిలబెట్టుకొనే పాత్రల కోసం అన్వేషిస్తున్నా. త్వరలోనే ఓ తీపి కబురు చెబుతా’’ అన్నారామె.