DailyDose

వాళ్ళిద్దరికీ ఒక్కడే వరుడు కావాలంట…

వాళ్ళిద్దరికీ ఒక్కడే వరుడు కావాలంట…

కొన్ని విషయాలు వినిడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. మలేషియా కి చెందిన ఇద్దరు ఆడవాళ్ల అభిరుచులు, అభిప్రాయాలు కూడా అంతే విడ్డూరంగా ఉన్నాయి.మా ఇద్దరికి ఇలా ఉండాలి. ఫలాన వ్యక్తి కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇప్పుడు అదే వరల్డ్ వైడ్‌గా వైరల్ అవుతోంది. మలేషియాలో నివసిస్తున్న 31సంవత్సరాల ఫాతిమా అజహ్రా , 27 ఏళ్ల ఫాతిన్ అక్మా బెస్ట్ ఫ్రెండ్స్. ఫాతిమా అజ్రహ ఓ బిడ్డ కూడా ఉంది. భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయింది. ఫాతిన్ అక్మా లాండ్రీ షాపు నడుపుతోంది. అయితే ఇప్పుడు వీళ్లద్దరు తమకు కావాల్సిన వరుడి గురించి ఫేస్‌బుక్‌ లో ఓ ప్రకటన ఇచ్చారు. ఇది ఎంత గమ్మత్తుగా ఉందంటే ఇద్దరికి ఒకే వ్యక్తి భర్తగా కావాలంటూ పోస్ట్ చేశారు. అదేంటి ఇద్దరికి ఒకే వ్యక్తి భర్తగా ఉండాలని కోరుకోవడం ఏమిటని ఫాతిమా, ఫాతిన్ చేసిన పోస్ట్ చూసి నవ్వుకుంటున్నారు నెటిజన్లు . అయితే ఈవిషయంల ఆ ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్ మాత్రం ఫుల్ క్లారిటీగా ఉన్నారు. అయితే ఎంత మంచి స్నేహితులైనా ఒకరి జీవితంలో ఉన్న వ్యక్తిని మరొకరికి భాగస్వామ్యం ఇవ్వాలనుకోరు. కాని ఈ ఇద్దరు మహిళలు మాత్రం ఒకే వ్యక్తితో వైవాహిక జీవితాన్ని పంచుకోవాలనుకోవడం చూస్తున్న నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇంత వినూత్నంగా ఆలోచించిన బెస్ట్ ఫ్రెండ్స్ తమకు కావాల్సిన వరుడి కోసం ఫేస్‌బుక్‌లో సెన్సే మలేషియా పేరుతో తమ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నారు. మేం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్..మమ్మల్ని ఇద్దర్ని మంచిగా చూసుకునే ఒక వ్యక్తి తమకు భర్తగా కావాలంటూ డైరెక్టర్‌గా తమ మనసులో ఉన్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు._

*మా ఇద్దరికి ఒక్కడే కావాలి..
ఫాతిమా అజహ్రా, ఫాతిన్ అక్మా పోస్ట్ చదువుతున్న ప్రతి ఒక్కరు డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తున్నారు. బాగా స్నేహంగా ఉండే ఇద్దరు అడవాళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాని ఫస్ట్ టైమ్‌ ఇద్దరు మహిళలు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే వార్త బయటకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ ఇద్దరు మహిళలు ఒకే వ్యక్తిని ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. ఇందుకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉంటే తమను సంప్రదించవచ్చని వివరాలు, ప్రొఫైల్‌ని ఫేస్‌ బుక్‌లో షేర్ చేశారు.

*సింగిల్ హస్బెండ్ కోసం బెస్ట్ ఫ్రెండ్స్ ప్రకటన..
ఇద్దరు ఆడవాళ్లు ఒకే వ్యక్తిని భర్త కోరుకోవడం సంచలనంగా మారింది. దీనిపై బ్యాచిలర్స్‌ కూడా అంతే స్పందిస్తున్నారు. పెళ్లికి ఉన్న కండీషన్స్‌తో పాటు పెళ్లి తర్వాత అంశాలపై సోషల్ మీడియా వేదికగా తమ డౌట్స్‌ని వ్యక్తపరుస్తున్నారు. అమ్మాయిలు చేసిన పోస్ట్‌ని ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఇద్దరమ్మాయిలకు ఒకే భర్త కావాలన్న ప్రకటనపై ఫేస్‌బుక్ పెళ్లి పరిచయ వేదికగా మారింది. మరి ఫాతిమా, ఫాతిన్‌లకు ఉమ్మడి మొగుడు ఎప్పుడు దొరుకుతాడో..ఎప్పుడు వీళ్ల పెళ్లి జరుగుతుందో అనే చర్చ కూడా ఫేస్‌బుక్‌లో విస్తృతంగా జరుగుతోంది.