ScienceAndTech

ఔషధాల ఖజానా.. కానుగ

ఔషధాల ఖజానా.. కానుగ

వేసవిలో వచ్చే ముంజెలమీద కానుగ ఆకుల్ని కప్పడం చూస్తుంటాం . కారణం ఏమిటని పరిశీలిస్తే- వేసవి ప్రారంభంలో కానుగ చెట్టు ఆకులన్నీ రాలి , చిగురించిన ఆకులన్నీ పచ్చని నిగారింపుతో మెరుస్తుంటాయి . వాటిమీద ఒకరకమైన మైనపు పూత ఉంటుంది . కాబట్టి అవి ముంజెల్లోని తడిని పీల్చవు సరికదా , ఆ ఆకుల వాసన వాటికి అంటదన్నమాట . దాంతో ముంజెలు తాజాగా ఉంటాయి . ఈ సంగతి అలా పెడితే , రోడ్డుపక్కన చల్లనినీడకోసం పెంచే కానుగ చెట్టు ఆరోగ్యానికి శ్రీరామరక్షలాంటిది . దీని ఆకులూ గింజలూ ఆయుర్వేదంలో వాడతారు . కడుపునొప్పి , గ్యాస్ సంబంధిత సమస్యలు , డయేరియా , దగ్గు … వంటి సమస్యలకి ఆకుల కషాయం పనిచేస్తుంది . ఇంకా రోగనిరోధకశక్తిని పెంచుతుంది . కానుగపుల్లతో దంతధావనం చేస్తే రుచి గ్రంథులు బాగా పనిచేస్తాయి . వీటి కాయల్లోని గింజల్ని మెత్తగా నూరి గాయంమీద పెడితే రక్తం కారడం తగ్గుతుంది . ఈ గింజలనుంచి తీసిన నూనెను బయోడీజిల్గా ఉపయోగిస్తారు . దీపాలు పెట్టడానికి వాడతారు . ఇందులోని యాంటీబయోటిక్ గుణాల వల్ల వత్తి కాలినప్పుడు వచ్చే వాసన సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది . చర్మ సమస్యలకి ఈ నూనె మందులా పనిచేస్తుంది . జలుబుతో బాధపడేవాళ్లకి ఈ నూనెను ఛాతీమీద మర్దిస్తే ఫలితం ఉంటుంది . -అతిమూత్ర సమస్యకి కానుగపూల పొడి పనిచేస్తుందట . కాబట్టి ఎక్కడో ఒకచోట కానుగ చెట్లను పెంచండి .