Business

భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..! – TNI వాణిజ్య వార్తలు

భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..!  – TNI వాణిజ్య వార్తలు

* సింగపూర్‌కు చెందిన దిగ్గజ సంస్థ సీ లిమిటెడ్‌(SEA) తమ ఈ-కామర్స్‌ వ్యాపారాన్ని భారత్‌లో మూసివేస్తున్నట్లు సోమవారం రోజున ప్రకటించింది. షాపీ(Shopee) పేరుతో ఈ కామర్స్‌ వ్యాపారాన్ని భారత్‌లో నిర్వహిస్తోంది సీ లిమిటెడ్‌ సంస్థ. ఫ్రాన్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కొన్ని వారాల్లోనే భారత్‌లో కూడా తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు షాపీ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.
*భారత క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ సంవత్సరం ఈ సంస్థలు ఇప్పటి వరకు రూ.1,14,855.97 కోట్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇందులో స్టాక్‌ మార్కెట్‌ అమ్మకాలే రూ.48,261.65 కోట్ల వరకు ఉన్నాయి. ద్రవ్యోల్బణ భయాలకు తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఆర్నెల్లుగా ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. కమోడిటీల ధరల పెరుగుదల ముఖ్యంగా చమురు సెగ భారత ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తుందని ఎఫ్‌పీఐలు భయపడుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు కూడా ఇందుకు తోడైంది.
*పీకల్లోతు అప్పుల్లో ఉన్న రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ వ్యాపారాలను దక్కించుకునేందుకు బడా కార్పొరేట్‌ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అనిల్‌ అంబానీ ప్రమోట్‌ చేసిన ఈ కంపెనీని హస్తగతం చేసుకునేందుకు అదానీ గ్రూప్‌తో పాటు టాటా ఏఐజీహెచ్‌డీఎ్‌ఫసీ ఎర్గోనిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌పిరామల్‌ గ్రూప్‌ సహా కంపెనీలు.. బిడ్స్‌ను సమర్పించాయి. కాగా ఐసీఐసీఐ లొంబార్డ్‌యస్‌ బ్యాంక్‌పూనావాలా ఫిన్‌కార్ప్‌ కూడా బిడ్‌ వేసినట్లు సమాచారం. అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ అప్పులు చెల్లించలేక ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉంది.
*దేశ కార్పొరేట్‌ రంగంలో మరో విలీనం చోటు చేసుకుంది. ప్రముఖ మూవీ ఎగ్జిబిషన్‌ సంస్థ ఐనాక్స్‌ లీజర్‌.. మరో ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ కంపెనీ పీవీఆర్‌ లిమిటెడ్‌లో విలీనమవుతోంది. ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఇందుకు ఆమోదం తెలిపాయి. పూర్తిగా షేర్ల కేటాయింపు పద్దతిలో ఈ విలీనం జరగనుంది. ప్రతి 10 ఐనాక్స్‌ లీజర్‌ షేర్లకు.. 3 పీవీఆర్‌ లిమిటెడ్‌ షేర్లు కేటాయిస్తారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కానుంది. విలీనం తర్వాత కంపెనీ పేరు పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌గా మారుతుంది.కొత్త కంపెనీ ఈక్విటీలో పీవీఆర్‌ ప్రమోటర్లకు 10.62 శాతం, ఐనాక్స్‌ లీజర్‌ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని రెండు కంపెనీల ప్రమోటర్లు భావిస్తున్నారు. ఈ విలీనంతో 1,500కుపైగా స్ర్కీన్లతో పీవీఆర్‌ ఐనాక్స్‌ అతిపెద్ద మల్టీప్లెక్స్‌ కంపెనీగా అవతరించనుంది.
*ఆమ్‌టెక్‌ ఆటో దివాలా పరిష్కార ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది. ఏబీజీ షిప్‌యార్డులానే ఇదో పెద్ద దగా కేసు అని ఆరోపించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. దివాలా కేసుల పరిష్కారం పేరుతో మోదీ ప్రభుత్వం కంపెనీల ప్రమోటర్లతో కుమ్మక్కవుతోందని పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ ఆరోపించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.25,000 కోట్ల రుణాల్లో 70 శాతాన్ని ఆమ్‌టెక్‌ ఆటో ప్రమోటర్లు 129 డొల్ల కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్టు చెప్పారు. ఈవై సంస్థ ఈ విషయం స్పష్టం చేసినా ఈ సంస్థ ఆస్తులను రూ.1,500 కోట్లకు అమ్మడంలోని ఔచిత్యాన్ని నిరుపమ్‌ ప్రశ్నించారు.
*ఐపీఎల్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ. 555తో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో డిస్లీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. అలాగే, రూ. 2,999 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌కు కూడా రూ. 499 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను జోడించింది
*ఐనాక్స్ లీజర్ లిమిటెడ్(బదిలీ కంపెనీ) విలీనానికి… తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పీవీఆర్ లిమిటెడ్(బదిలీ సంస్థ) ఆదివారం తెలిపింది. ఐనాక్స్ బోర్డు కూడా విలీన పథకాన్ని ఆమోదించింది. ఆపరేషన్ ఒప్పందం) పథకం ప్రకారం ప్రతిపాదిత సమ్మేళనాన్ని ప్రభావితం చేసే విధానాన్నిప్రాతినిధ్యాలువారెంటీలుసంబంధిత పార్టీల హక్కులుబాధ్యతలను నిర్దేశిస్తుందని పీవీఆర్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. పీవీఆర్ఐనాక్స్… రెండూ సినిమా ప్రదర్శనఆహారపానీయాలుఅనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు.
*చిన్న పట్టణాల మధ్య ఎయిర్‌ కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) ‘సరస్‌ ఎంకే 2’ పేరుతో లైట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విమానాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో 19 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు, రక్షణ బలగాలు, వీఐపీల రవాణా, ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలకు దీన్ని వినియోగించవచ్చని ఎన్‌ఏఎల్‌ డైరెక్టర్‌ జితేంద్ర జాదవ్‌ తెలిపారు
*లిథియం-అయాన్‌ బ్యాటరీలను తయారు చేస్తున్న సిగ్నీ.. హైదరాబాద్‌ సమీపంలో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. దాదాపు ఏడాదికి 40 వేల బ్యాటరీల తయారీ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. లిథియం-అయాన్‌ బ్యాటరీలను ఎలక్ట్రిక్‌ వాహనాల్లో, టెలికాం టవర్లు నిర్వహణ మొదలైన చోట్ల వినియోగిస్తున్నారు. విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిఽధుల కోసం 70 లక్షల నుంచి కోటి డాలర్లను రుణాలు, ఈక్విటీ రూపంలో సమకూర్చుకోవాలని సిగ్నీ యోచిస్తోంది