NRI-NRT

అమెరికాలో భారీగా మంచు.. 50 వాహ‌నాలు ఢీకొని ముగ్గురు మృతి

అమెరికాలో భారీగా మంచు.. 50 వాహ‌నాలు ఢీకొని ముగ్గురు మృతి

అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమ‌వారం భారీగా మంచు కురిసింది. ద‌ట్ట‌మైన మంచు ఏర్ప‌డ‌టంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఒక‌దానికొక‌టి 50 నుంచి 60 వాహ‌నాలు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ 60 వాహ‌నాల్లో కార్ల‌తో పాటు ట్రాక్ట‌ర్ ట్రాలీలు కూడా ఉన్న‌ట్లు స్థానిక పోలీసులు తెలిపారు. హైవేపై ఉన్న మంచును తొల‌గించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఒకే నెల‌లో ఇది రెండోసారి అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.