NRI-NRT

ఫెడెక్స్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతి వ్యక్తి

ఫెడెక్స్ సీఈవోగా  బాధ్యతలు చేపట్టనున్న  భారత సంతతి వ్యక్తి

అంత‌ర్జాతీయ కొరియ‌ర్ డెలివ‌రీ సంస్థ ఫెడెక్స్‌కు భార‌తీయ సంత‌తికి చెందిన రాజ్ సుబ్ర‌మ‌ణియ‌మ్ సీఈవోగా బాధ్య‌త‌లు చేపట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్ర‌స్తుతం చైర్మెన్‌, సీఈవో ఫ్రెడ్రిక్ వి స్మిత్ స్థానంలో రాజ్ సుబ్ర‌మ‌ణియ‌మ్ ఆ బాధ్య‌త‌లు తీసుకుంటారు. జూన్ ఒక‌టో తేదీ నుంచి ఫ్రెడ్రిక్ త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్నారు. ఇక తాను బోర్డు ప‌రిపాల‌న‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు స్మిత్ తెలిపారు. ఫ్రెడ్రిక్ ఓ విజిన‌రీ నేత అని, వ్యాపార ప్ర‌పంచంలో అత‌నో లెజెండ్ అని, ప్ర‌పంచంలోనే అతి పెద్ద కంపెనీని ఆయ‌న స్థాపించార‌ని, ఆయ‌న బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌డం గౌర‌వంగా భావిస్తాన‌ని సుబ్ర‌మ‌ణియ‌మ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. టెన్నిసెసీలో ఫెడెక్స్ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. ఆ కంపెనీలో సుమారు ఆరు ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. 2020లో ఫెడెక్స్ బోర్డు ఆఫ్ డైర‌క్ట‌ర్స్‌కు సుబ్ర‌మ‌ణియం ఎంపిక‌య్యారు.