NRI-NRT

లండన్‌లో బాడ్మింటన్‌ పోటీలు

Auto Draft

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్‌) ఆధ్వర్యంలో నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2022 26 మార్చిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ స్పోర్ట్స్ హాల్‌లో నిర్వహించింది. టోర్నీని తిలకించేందుకు లండన్ చుట్టుపక్కల ప్రాంతాలనుంచి తెలుగు క్రీడాకారులు వచ్చారు. పురుషుల డబుల్స్, పురుషుల 40 ప్లస్‌ డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, మహిళల డబుల్స్, అండర్‌ 13, అండర్‌ 16 విభాగాల్లో పోటీలు జరిగాయి. మొత్తం 175 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. తాల్‌ చైర్‌పర్సన్‌ భారతి కందుకూరి, స్పోర్ట్స్‌ ట్రసీ నోముల అనిత, సమన్వయకర్తలు బాలాజీ కల్లూరు , రాజేష్ వీరమాచనేని, ట్రెజరర్‌ రాజేష్ తోలేటి , ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిల్ అనంతులలు ఆటగాళ్లకు విజేతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం అనంతరం విజేతలు, రన​‍్నరప్‌లకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు.