NRI-NRT

అమెరికాలో బిలియనీర్స్ కి బిగ్ షాక్ ఇవ్వనున్న బిడెన్…!

అమెరికాలో బిలియనీర్స్ కి బిగ్ షాక్ ఇవ్వనున్న బిడెన్…!

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పీడు పెంచారు.అమెరికాలో బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కొత్త పన్ను విధానంలోకి వస్తారని ప్రకటించారు.వచ్చే ఏడాది అనగా 2023 కి కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటికే బిడెన్ సర్కార్ సిద్దమవుతోంది.ఈ పన్ను పరిధిలోకి ఎవరెవరు వస్తారో అనే విషయంపై అధికారుల వద్ద పూర్తి స్థాయి రిపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ విధానం అమలైతే సుమారు 700 మంది ధనవంతులపై ఈ ప్రభావం పడనుందట.అయితే బిడెన్ సరికొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా ముందుగా ప్రభావం పడనుంది ప్రపంచ ధనవంతులలో అగ్ర స్థానం సాధించిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పైనేనట ఈయన సుమారు 35 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కట్టాల్సి ఉందట.ఇక రెండవ స్థానంలో ఎలన్ మస్క్ ఉండగా ఈయన సుమారు 50 బిలియన్లు చెల్లించాల్సి ఉందట.ఈ తాజా చట్టానికి పేరు కూడా పెట్టారు అదేంటంటే “బిలినియర్ మినిమం ఇన్కంటాక్స్.”వైట్ హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం.100 మిలియన్ లకంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న సుమారు 700 మంది బిలియనీర్ల నుంచీ 20 శాతం పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.ఇలా చేయడం వలన రానున్న 10 ఏళ్ళలో 1 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ లోటును తగ్గించినట్టు అవుతుందని ఇందుకు ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందని ఓ కధనం వెల్లడించింది.అనుకున్నట్టుగానే బిడెన్ ప్రభుత్వం రానున్న 10 ఏళ్ళలో గనుక ఈ కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం వసూళ్లు చేస్తే ప్రభుత్వ ఖజానా కు దాదాపు 360 బిలియన్ల ఆదాయం వచ్చి పడనుందట.