DailyDose

లండన్ లో ఎన్నారై యువతిపై కత్తితో దాడి -TNI నేర వార్తలు

లండన్ లో  ఎన్నారై యువతిపై కత్తితో దాడి -TNI నేర వార్తలు

*లండన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్న యువతిపై ఓ దుర్మార్గుడు కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడవడంతో ఆ యువతి తీవ్రంగా గాయాలపాలైంది. విషమ పరిస్థితుల మధ్యల లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేరళాకు చెందిన సోనాబిజు (22) అనే యువతి మాస్టర్స్‌ చదివేందుకు గత నెల లండన్‌ చేరుకుంది. యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌లో చదువుతోంది. అక్కడే ఉన్న హైదరాబాద్‌ వాలా రెస్టారెంట్‌లో వెయిట్రస్‌గా పార్ట్‌టైం జాబ్‌ చేస్తోంది. కాగా 2022 మార్చి 25న ఆమెపై దాడి జరిగింది. మధ్యాహ్నం 2:20 సమయంలో ఆర్డర్‌ తీసుకునేందుకు ఓ టేబుల్‌ దగ్గరికి వెళ్లగా.. అక్కడ కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా ఆమె మీదకు వచ్చాడు. దగ్గరగా పట్టుకుని కత్తితో పొడవడం ప్రారంభించారు. అడ్డుకునేందుకు అక్కడున్న సిబ్బంది, ఇతర కస్టమర్లు ప్రయత్నించగా వారిని సైతం బెదిరించాడు. ఆ తర్వాత విచక్షణా రహితంగా ఆమె మీద దాడి చేసి అక్కడి నుంచి పరార్‌ అయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించగా దాడికి పాల్పడింది కూడా ఇండియన్‌గానే తేలింది. హైదరాబాద్‌కి చెందిన శ్రీరామ్‌ అంబర్ల (23) అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టుగా గుర్తించిన లండన్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. థేమ్స్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో అతడిని హాజరుపరచగా ఏప్రిల్‌ 25 వరకు రిమాండ్‌ విధించారు. కేసు దర్యప్తు సాగుతోంది. మార్చి 19న బ్రిటీష్‌ ఇండియన్‌ సబితా (19) యువతిపై జరిగిన కత్తి దాడి ఘటన మరువకముందే లండన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.

*మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా 9మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స అందించి వేరే బస్సులో భద్రాచలంకు పంపించారు.

*రామ‌న్న‌పేట మండ‌లం దుబ్బాక వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న చిన్నారి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

*కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన దంపతులిద్దరు మృతి చెందారు. నిన్న చేపల వేటకు వెళ్లిన వీరి తెప్ప ఈదురుగాలుల కారణంగా బోల్తా పడి గల్లంతయ్యారు. నిన్న గజ ఈతగాళ్ల సహాయంతో గాలించిన ఫలితం కనపించలేదు. ఈ రోజు కొంత దూరంలో దంపతుల మృతదేహాలు అక్కన్న, జయలక్ష్మి లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

*విశాఖపట్నం నగరంలోని పాయకరావుపేట మండలం నామవరం జంక్షన్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కేడ మృతి చెందగా… నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 21 మంది బడిపిల్లలతో ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 19 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అందరూ చికిత్స పొందుతున్నారు. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా.. జిల్లాలోని దేవాస్ రోడ్డులో ఛందేసర గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే కారణమని తెలుస్తోంది. డ్రైవర్ మ్యూజిక్ వింటూ వాహనం నడిపాడని పిల్లలు తెలిపారు.

*హైదరాబాద్న గరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం సేవించి ఓ యువకుడు రాష్ డ్రైవింగ్ చేశాడు. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఓ ఆటోతో పాటు రెండు ద్వి చక్రవాహనాలను ఢీకొట్టాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యువకుడికి బ్రీత్ ఎన్లేజర్ టెస్ట్ చేయగా 233 పాయింట్స్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

*భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురైన ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరప మండలం నడకుదురు రామలింగేశ్వర కాలనీకి చెం దిన సూరంపూడి నాగేశ్వరరావు(42)కు వలసపాకల గ్రామానికి చెందిన పద్మావతితో 23 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో పదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. రెండురోజుల క్రితం నాగేశ్వరరావు వలసపాకల వెళ్లి భార్యను కాపురానికి రావాల్సిందిగా కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో మనస్థాపం చెందిన నాగేశ్వరరావు సోమవారం నడకుదురులోని తాను అద్దెకుంటున్న రేకులషెడ్డులో ఇనుప గొట్టానికి కేబుల్‌ వైర్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి సాయిలక్ష్మీకుమారి ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు.

*తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని ఓ మహిళ ఆందోళన వ్యక్తంచేసింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్‌బీకి ఆళ్ళగడ్డ మండలానికి చెందిన నాగరాజుకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నేపథ్యంలో కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. సోమవారం నగరంలోని ఎస్‌ఆర్‌ గ్రౌండ్‌ హోటల్‌లో పెళ్లి రిసెప్షన చేసుకుంటుండగా మహబూబ్‌ బీ తన కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న దిశ పోలీసులు విచారించారు. తన మొదటి భార్యకు తలాక్‌ చెప్పిన తరువాతనే రెండో వివాహం చేసుకున్నానని నాగరాజు వాదిస్తున్నాడు. కానీ తలాక్‌కు తాను అంగీకరించలేదని మహబూబ్‌బీ తెలిపింది.

*వైసీపీటీడీపీ వర్గీయుల ఘర్షణ కేసులో ఓ సర్పంచ్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ ఆయనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతపురం జిల్లా రొద్దం మండలంలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దీనికి నిరసనగా టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్ధసారథి… పార్టీ నాయకులుకార్యకర్తలతో కలిసి రొద్దం పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రొద్దం మండలం బీదానిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చంద్రమౌళి అనే వ్యక్తి తప్పతాగి తిడుతుండగా వైసీపీ వర్గీయులు ప్రభాకర్‌శేషప్పచలపతిమరో ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. గొడవ దృశ్యాలను చంద్రమౌళి వర్గీయులు గోపీబాలాజీ(టీడీపీ) సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో గొడవ మరింత పెరిగి చంద్రమౌళిపై ప్రత్యర్థులు రాళ్లుకట్టెలతో దాడిచేశారు. దీంతో రొద్దం ఎస్‌ఐ నాగమునిస్వామి సోమవారం వైసీపీ వర్గీయులు ముగ్గురుటీడీపీ వర్గీయులు ఎనిమిది మందిని స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టారు. చంద్రమౌళికి మద్యం తాగించి గొడవకు ప్రేరేపించారన్న ఆరోపణతో కంబాలపల్లి సర్పంచ్‌ మంజునాథ్‌ను కూడా స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టారు. దీంతో టీడీపీ నాయకులు స్టేషన్‌ ముందు బైఠాయించారు.

*చైతన్యపురి పోలీస్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లారుజామున ఎక్స్‌యూవీ- కారు దగ్ధమైంది. ద్వారకానగర్‌ ఎస్‌బీఐ కాలనీకి చెందిన వి.సత్యనారాయణ తన కారును ఆదివారం రాత్రి గంటలకు ఇంటి ముందు పార్కు చేశాడు. సోమవారం తెల్లవారుజామున కారు మంటల్లో తగలబడుతూ పెద్ద శబ్దం వచ్చింది. గమనించిన యజమాని బయటకు వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో కారు పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరో దుండగులు కావాలనే తన కారును తగలబెట్టి ఉంటారని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఓ వ్యక్తిపై అనుమానం ఉందన్నాడు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*రామ‌న్న‌పేట మండ‌లం దుబ్బాక వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న చిన్నారి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.