NRI-NRT

బర్మింగ్‌హామ్‌లో ఘనంగా టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!

బర్మింగ్‌హామ్‌లో ఘనంగా టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు!

అన్నా అని ఆప్యాయంగా పిలిచే తోబుట్టువుల కోసం ఒక అన్నగా, ఆప్తుడిగా దేశంలోనే మొదటి సారి ప్రతీ కుటుంబంలో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని ప్రకటించిన అన్నగారు స్థాపించిన పార్టీ పుట్టి 40వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా NRI యూరోప్ టీం Dr. శ్రీ కిషోర్ బాబు సమన్వయంతో ప్రవీణ్ కఠమనేని ఆధ్వర్యంలో Birmingham లో తమకు హక్కులు కల్పించి తమ ఉన్నతికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన జెండా పండుగను పసుపు పచ్చని వస్త్రధారణతో వేదిక మొత్తం పసుపు మయం చేస్తూ ప్రపంచ వేదికల మీద తెలుగు మహిళ గొప్పతనాన్ని తెలియచేసిన పార్టీ జెండా పండుగ అంగరంగ వైభవంగా అందుబాటులో ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీ కుల మతాలకు అతీతంగా ఒక కుటుంబం లాగా కలిసి చేశారు!
1a
ఆడపిల్లలే కదా ఏమి చేస్తారులే అనుకుంటే ఆడపిల్లలం కాదు ఆడ శివంగులం అనేలా.. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు అని వేదిక దద్దరిల్లేలా జెండా పండుగను ఘనంగా చేశారు. తెలుగు మహిళ అంటే వీళ్లే అనే విధంగా తమ సత్తా చాటుతూ విదేశాల్లో తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగ ఘనంగా చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టాభి.. తెలుగుదేశం పార్టీ కుటుంబ సబ్యులకు, సభ నిర్వాహకులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపి తెలుగుదేశం పార్టీ పుట్టుక ఆవశ్యకత, తెలుగుదేశం పార్టీ విశిష్టతను తెలియచేశారు. సుమారు రెండు గంటల పాటు తన మాటలతో సభికులను ఆకట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత గురించి, అన్న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహిళలకు చేసిన సేవలను పేర్కొన్నారు. ఇలా ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలు జరిగాయి.
1b
1d