NRI-NRT

గల్ఫ్ దేశాలలో ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు

గల్ఫ్ దేశాలలో ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు

తెలుగు దేశం జి.సి.సి ఆధ్వర్యంలో కువైట్ , సౌదీ అరేబియా , ఖతార్ , ఓమన్ , బహ్రెయిన్ , దుబాయి , అబుదాబి , షార్జా , రాస్ అల్ – ఖైమా , పుజైరాహ్ ప్రాంతాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు . 25 నుంచి 29 వ తేదీ వరకూ జరిగే ఈ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు . ఖతార్ వేడుకల్లో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ కార్యక్రమాలన్నీ ఈ మధ్యే ప్రకటించిన ఎన్నారై తెదేపా కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి . ఈ సందర్భంగా తెదేపా కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ .. గల్ఫ్ దేశాల్లోని తెలుగుదేశం అభిమానులందరూ ఆయా ప్రాంతాల్లో జరగనున్న వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు .
Whats-App-Image-2022-03-29-at-13-28-29