NRI-NRT

పలు దేశాల్లో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు

పలు దేశాల్లో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను రాష్ట్రంలోనే కాకుండా ఖండాంతరాలలో సైతం ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రేటర్ వాషింగ్టన్, ఐర్లాండ్​లోని పలు ప్రాంతాల్లో, నార్త్ కెరొలినా, మెల్​బోర్న్​లో తెదేపా నేతల సంబరాలు అంబరాన్నంటాయి.

*అమెరికాలో ఘనంగా తెదేపా 40 వసంతాల వేడుకలు
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాలలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, తెలుగు జాతి వికాసం కోసం తెదేపా పుట్టిందని పలువురు అన్నారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెదేపా అభిమానులు.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయటమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

*ఐర్లాండ్ లోని పలు ప్రాంతాల్లో:
తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను ఎన్​ఆర్​ఐ తెదేపా కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎన్​ఆర్​ఐ తెదేపా యూరప్‌ విభాగం తరపున.. ఐర్లాండ్​లోని డబ్లిన్, లిమెరిక్, కార్క్, గాల్వే నగరాల్లో తెలుగుదేశం పార్టీ అవిర్భావ పండుగను జరుపుకున్నారు. 40 వసంతాల ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు పాల్గొని తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్‌ చేశారు.నార్త్ కెరొలినాలో సంబరాలు: తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు సమావేశమమై… ఎన్నారై తెదేపా షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ నెలకొన్న పరిస్థితులపై తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

*మెల్‌బోర్న్‌లో అభిమానులు ర్యాలీ:
తెలుగుదేశం పార్టీ 40వసంతాల వేడుక సందర్భంగా మెల్‌బోర్న్‌లో పార్టీ అభిమానులు ర్యాలీ నిర్వహించి.. జై తెదేపా ఆకృతిని కార్లతో ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.