DailyDose

జిల్లాల పునర్విభజన చారిత్రాత్మక నిర్ణయం – TNI రాజకీయ వార్తలు

జిల్లాల పునర్విభజన చారిత్రాత్మక నిర్ణయం  – TNI రాజకీయ వార్తలు

*ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు పంచటం టీడీపి సంస్కృతని, ఇప్పటికే చంద్రబాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కోసం డబ్బులు కూడ పెడుతున్నారని ధ్వజమెత్తారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, గతంకంటే వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తీసుకున్న జిల్లాల పునర్విభజన ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఉగాది రోజున లాంచనంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని, దీంతో కొత్త జిల్లాల వల్ల ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత దగ్గర కానున్నట్లు మంత్రి తెలిపారు.

*ప్రజలకు జగన్ వేసవి షాక్: లోకేష్
సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే.. దానికి రివ‌ర్స్ చేస్తాడని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి, ప్రజలకు వేసవి షాక్ ఇచ్చాడని దుయ్యబట్టారు. తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. క‌రెంటు చార్జీలు బాదుడే.. బాదుడంటూ నాడు దీర్ఘాలు తీశాడని, ఇప్పుడు చార్జీలు భారీగా పెంచి జ‌నానికి షాక్ కొట్టించారని మండిపడ్డారు. ‘‘మాట త‌ప్పుడుకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌.. మడ‌మ తిప్పుడుకి ఐకాన్ జ‌గ‌న్‌. సీఎం ప‌ద‌వి కోసం జ‌గ‌న్ తొక్కని అడ్డదారి లేదు’’ అని లోకేష్‌ ధ్వజమెత్తారు. ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయి. పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు.

*ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం: అశోక్‌బాబు
ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం పడుతుందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్యాన్‌కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే వణికిపోతున్నారని తెలిపారు. ఈఆర్‌సీ ధరలపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పవర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. సీఎం జగన్‌ మూడేళ్లలోనే 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని అశోక్‌బాబు తప్పుబట్టారు.ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయి. పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు.

*ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే వణికిపోతున్నారు: అశోక్‌బాబు
ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఫ్యాన్‌కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే వణికిపోతున్నారని విమర్శించారు. బొగ్గు కేంద్రాలకు బకాయిలు, సోలార్ ఒప్పందాల రద్దుతోనే ఈ పరిస్థితి ఏర్పాడిందన్నారు. ఈఆర్‌సీ ధరలపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పవర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శమన్నారు. జగన్‌ మూడేళ్లలోనే 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*కేంద్రంలో మోదీ ధరలు పెంచితే.. ఇక్కడ జగన్ చప్పట్లు కొడుతున్నారు: శైలజానాథ్
జేపీ చెప్పేదొకటి.. చేసేదొకటంటూ ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే పెట్రో ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రజలను దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. నిరసన తెలిపితే అక్రమ కేసులు, దేశద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ప్రధాని మోదీ ధరలు పెంచితే.. ఇక్కడ జగన్ చప్పట్లు కొడుతున్నారన్నారు. మోదీని వైసీపీ నేతలు నిలదీయలేకపోతున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు అమ్ముతాం.. హోదా ఇవ్వమని చెప్పినా ఏమీ చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. ధరల పెంపునకు నిరసనగా గురువారం విజయవాడలో ఆందోళనకు పిలుపిచ్చారు. అలాగే ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. 7న విశాఖలో ఆందోళన కార్యక్రమాలకు శైలజానాథ్ పిలుపిచ్చారు.

*పెట్రోలు ధరల పెంపు మోదీ రోజువారీ కార్యక్రమం : రాహుల్ గాంధీ
పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోజువారీ చేసే పనుల్లో ఈ ధరల పెంపకం ఓ భాగంగా మారిపోయిందని మండిపడ్డారు. RozSubahKiBaat అనే హ్యాష్‌ట్యాగ్‌తో బుధవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ప్రధాన మంత్రి రోజువారీ పనుల జాబితా – పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల్లో పెరుగుదల ఎంత? ప్రజల ఖర్చులపై చర్చను ఎలా ఆపాలి? యువతకు ఉద్యోగాల కల్పనపై పగటి కలలను ఏవిధంగా చూపించాలి? ఏ ప్రభుత్వ రంగ కంపెనీని అమ్మేయాలి? రైతులను మరింత నిస్సహాయులుగా చేయడం ఎలా?’’ అని పేర్కొన్నారు. బుధవారం పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గడచిన తొమ్మిది రోజుల్లో ఈ ధరల పెరుగుదల లీటరుకు రూ.5.60కి చేరింది.

* రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించండి – తులసి రెడ్డి
రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అతి త్వరలో సీఎం జగన్ రాష్ట్రానికి ఐపీ పెట్టనున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అతి త్వరలో సీఎం జగన్ రాష్ట్రానికి ఐపీ పెడతారని ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవహారాలన్నీ రాష్ట్రపతి పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంపై 7 లక్షల 76 వేల కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. ఒక్కో మనిషిపై లక్షన్నర రుణం ఉన్నట్లేనని తులసిరెడ్డి చెప్పారు. బడ్జెట్లో చూపించకుండా 86 వేల 260 కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు.

*ఖైనీ, గుట్కా యాడ్స్ తొలగించి ఆ ప్లేస్‌లో కొడాలి నానివి ఇవ్వాలి: బుద్దా వెంకన్న
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. టీవీల్లో కొడాలి నానిని చూస్తే బూచోడు అంటూ పిల్లలు, తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. సినిమా ప్రారంభం ముందు వచ్చే ఖైనీ, గుట్కా ప్రకటనలు తొలగించి ఆ ప్లేస్‌లో కొడాలి నాని ప్రకటనలివ్వాలన్నారు. రాష్ట్ర ప్రజలు కొడాలినానిని ఓ చీడపురుగులా చూస్తున్నారన్నారు. 420 పార్టీలో కొడాలి నాని ఓ 840 అని విమర్శించారు. వైసీపీ పుట్టుకే 420 నుంచి అని కొడాలి నాని మరిచాడా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. మంత్రి పదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని పరోక్ష హెచ్చరికలు పంపాడన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలి నానిని వైసీపీ నేతలే అసహ్యించుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిలా తండ్రి అధికారం పెట్టుకుని ప్రజా ధనం దోచుకునే బుద్ధి ఎన్టీఆర్ పిల్లలెవ్వరికీ లేదని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. హరికృష్ణ ఇమేజ్‌ని డామేజ్ చేసిన వెన్నుపోటుదారుడు కొడాలి నాని అని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డే హత్య చేయించాడని వివేకా కుటుంబ సభ్యులంతా చెబుతున్నారన్నారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరైనా చెప్పారా? అని నిలదీశారు. అలా ఎవరైనా చెప్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని బుద్దా వెంకన్న తెలిపారు.

*ఆదాయం తగ్గిపోతే అంత బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు?: రామకృష్ణ
రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోతే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2లక్షల 56వేల కోట్ల భారీ బడ్జెట్ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెట్టారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఎక్కడైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. అప్పులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ అయినా రాష్ట్రానికి వచ్చిందా అని ఆయన అన్నారు. ఉపముఖ్యమంత్రి పదవి అంటే ఏంటో సరిగ్గా తెలియకనే వారిని ఇంటికి పంపి జగన్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి లేకపోతే ఇంకా రెచ్చిపోతానంటూ కొడాలినాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రుల బూతుమాటలతో సిఎం ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలో హుందా తనం ఉండాలని, వైసీపీ మంత్రుల వల్ల విలువలు క్షిణిస్తోందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని రామకృష్ణ అన్నారు.

*31న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు: మస్తాన్ వలి
బీజేపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలకు నిరసనగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ…ఈ నెల 31న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గోంటారన్నారు. మోదీ ప్రభుత్వంలో భారతీయుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి… ఇప్పుడు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ద్వారా 26లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుందని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించి జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో బీజేపీ రెండుకళ్ళ సిద్ధాంతం అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులపై వ్యతిరేకంగా మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత అప్పు ఎందుకు చేసారని యువత ప్రశ్నించాలని మస్తాన్ వలి పేర్కొన్నారు.

*జగన్‌ చేసింది శూన్యం: ఆనందబాబు
రాష్ట్రానికి మూడేళ్లలో సీఎం జగన్‌ చేసింది శూన్యమని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. నగరంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ స్థాయిలో పార్టీలను ఢీకొట్టిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి తొలి నుంచి వెనుకబడిన వర్గాలు అండగా నిలిచాయన్నారు. గడపగడప వెళ్లమని ఎమ్మెల్యేలకు జగన్‌రెడ్డి చెప్పారని, ప్రతి గడప దగ్గర వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజాగ్రహం చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు. తాము గౌతమ్ బుద్దుల్లా చూస్తూ కూర్చున్నామని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికి తప్పకుండా సమాధానం చెబుతామన్నారు. వేమూరు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమన్నారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు వెకిలి చేష్టలు తలదించుకునేలా ఉన్నాయన్నారు. న్యాయస్థానాలను, తీర్పులను అవహేళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మద్యం అమ్మే సీఎం దేశంలో జగన్ ఒక్కడేనన్నారు. ఏపీ మొత్తం జే బ్రాండ్స్ మాత్రమే అమ్ముతున్నారన్నారు. మద్యం ద్వారా జగన్ జేబులోకి ఏడాదికి 20 వేల కోట్లు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కృష్ణా నది పక్కన ఉన్నవారికి కూడా ఇసుక దొరకని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

*టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని ఫైర్టీ
డీపీ నేతలపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోవాలన్నారు. గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు జరగకుండా కోర్టుకు వెళ్లింది టీడీపీ నేతలే అని చెప్పారు. ఒత్తిడితో బాబ్జీ లాంటి చిన్న నేతల గుండెలే ఆగిపోతాయా?, చంద్రబాబు లాంటి నేతలు చనిపోరా? అని కొడాలి నాని ప్రశ్నించారు. తనను ఏమీ చేయలేక.. చనిపోయినవారి కుటుంబాన్ని రోడ్డుకు లాగడం దుర్మార్గమన్నారు.

*చంద్రబాబు దూరదృష్టితోనే….: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి, స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు దూరదృష్టితోనే తెలంగాణను ఆర్థికవనరులు సమకూరుతున్నాయన్నారు. చంద్రబాబు మాదిరి కష్టపడే నాయకుడు దేశంలో ఎక్కడా లేరని కొనియాడారు. జగన్‌ ఒక్కచాన్స్‌ అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

* ఎందరో అభాగ్యుల కన్నీళ్లు తుడిచిన మహనీయుడు ఎన్టీఆర్: దేవినేని ఉమా
40 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గొల్లపూడిలో నిర్వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమా
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నలభై వసంతాల సందర్భంగా తెలుగు ప్రజలందరికీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారుపేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పార్టీ పెట్టి ఎందరో అభాగ్యుల కన్నీళ్లు తుడిచిన మహనీయుడు ఎన్టీఆర్ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన మొట్ట మొదటి వ్యక్తి ఎన్టీఆర్ వృద్ధులకు పింఛన్, మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే ఆ మహనీయుని స్పూర్తితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా టీడీపీ జెండాను నిలిపారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి చాటి చెప్పినా, తెలుగు రాష్ట్రాలని ప్రపంచ పటంలో నిలబెట్టినా అది ఒక్క టీడీపీకే సాధ్యం త్వరలో నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి ప్రతి తలుపు తట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తా40 సంవత్సరాల మహా ప్రస్థానంలో కార్యకర్తలు, నాయకుల త్యాగాలు మరువలేనివి.