NRI-NRT

అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌

అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. పెట్టుబడుల సాధనకోసం మంత్రి కేటీఆర్‌ బృందం ఈనెల 18న అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వివిధ కంపెనీల అధిపతులతో చర్చలు జరిపారు. ఫార్మా, లైఫ్‌సెన్సెస్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌, ఐటీ కంపెనీలు రాష్ట్రంలో రూ.8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. ఈ మేరకు ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. న్యూయార్క్‌లోని అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ రూ.1,750 కోట్లతో హైదరాబాద్‌‌‌‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ముందుకొచ్చింది. అదేవిధంగా న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా సంస్థ సీఈవో అజయ్‌సింగ్‌ రూ.150 కోట్లు పెట్టుబడి పెడుతామని ప్రకటించారు. మెడికల్‌ డివైజెస్‌ తయారీ సంస్థ ఫార్మకోపియా రూ.1,525 కోట్లతో హైదరాబాద్‌లోని జీనోమ్‌‌ వ్యాలీలో అధునాతన ల్యాబ్‌‌ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.