DailyDose

అతిపెద్ద క్రిప్టో చోరీ.. 600 మిలియ‌న్ల డాల‌ర్లు మాయం -TNI నేర వార్తలు

అతిపెద్ద క్రిప్టో చోరీ.. 600 మిలియ‌న్ల డాల‌ర్లు మాయం  -TNI నేర వార్తలు

* సుమారు 600 మిలియ‌న్ల డాల‌ర్ల విలువైన క్రిప్టోకరెన్సీని హ్యాక‌ర్లు దొంగ‌లించారు. పాపుల‌ర్ ఆన్‌లైన్ గేమ్ ఎక్సీ ఇన్‌ఫినిటీ లెడ్జ‌ర్ నుంచి ఆ దొంగ‌త‌నం జ‌రిగింది. ఇటీవ‌ల క్రిప్టోక‌రెన్సీకి డిమాండ్ పెర‌గ‌డంతో.. టెక్ దొంగ‌లు ఆ మ‌నీని టార్గెట్ చేస్తున్నారు. 1,73,600 ఈత‌ర్ల‌తో పాటు 25.5 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన స్టేబుల్‌కాయిన్‌ను డిజిట‌ల్ లెడ్జ‌ర్ నుంచి చోరీ చేసిన‌ట్లు రోనిన్ నెట్‌వ‌ర్క్ తెలిపింది. మార్చి 23వ తేదీన చోరీ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఆ క‌రెన్సీ విలువ సుమారు 545 మిలియ‌న్ల డాల‌ర్లు. అయితే మంగ‌ళ‌వారం నాటి ధ‌ర‌ల‌తో పోలిస్తే ఆ విలువ 615 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని బావిస్తున్నారు.క్రిప్టో ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చోరీల్లో ఇదే అతిపెద్ద‌ద‌ని రోనిన్ నెట్వ‌ర్క్ తెలిపింది. దొంగ‌లించిన క‌రెన్సీ ఇంకా హ్యాక‌ర్ల వ్యాలెట్‌లోనే ఉన్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. ఇత‌ర్ క‌రెన్సీ విత్‌డ్రా కోసం మంగ‌ళ‌వారం ఓ వినియోగ‌దారుడు ప్ర‌య‌త్నించాడు. అయితే ఆ స‌మ‌యంలో ఎక్సీ ఇన్‌ఫినిటీలో చోరీ జ‌రిగిన‌ట్లు గుర్తించారు. హ్యాకింగ్ ఘ‌ట‌న‌పై రోనిన్ సంస్థ విచార‌ణ చేప‌డుతోంది. హ్యాక‌ర్ల వ‌ద్ద డిజిట‌ల్ ఫండ్స్‌కు చెందిన విత్‌డ్రా కీ ఉన్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు.

*మెదక్: జిల్లాలోని నర్సాపూర్ పట్టణం పోస్ట్ ఆఫీస్ వద్ద షేక్ మొయిన్(32)పై సాయబ్ అలీ(22) అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. షేక్ మోయిన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. నిందితుడు సాయబ్ అలీ సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గౌస్ కుమారుడుగా గుర్తించారు.

*భద్రాద్రి: జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రుని పేట ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదవుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ఆనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 19న హాస్టల్ నుండి ఇంటికి వెళ్లింది. విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఈనెల 27న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*గుంటూరు: జిల్లాలోని తెనాలిలో దారుణం జరిగింది. బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి చేశాడు. పాస్టర్ అహరోన్ ప్రకాశ్ తనపై లైంగిక దాడి చేసినట్లు బాలుడు తెలిపాడు. గత 10 నెలలుగా కల్వరీ ప్రార్థనా మందిరంలో ఆ బాలుడు ఉంటున్నాడు. బాలుడు అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనపై జరిగిన అమానుష సంఘటనను వివరించాడు. ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కేసును వాపస్ తీసుకోవాలని బాధితులతో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మంతనాలు జరుపుతున్నాడు.

* జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా భద్రతా బలగాల కాల్పులు జరిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిని లష్కరే తొయిబాకు (LeT) చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

* వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలం అంగడి చిట్టంపల్లిలో సంచలనం సృష్టించిన విద్యార్థిని అత్యాచారం, హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బాధిత విద్యార్థినిపై ఆమె స్నేహితుడే హత్యాచారానికి పాల్పడినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ప్రధాన నిందితుడు మహేందర్‌ అలియాస్‌ నాని నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాగిన మైకంలో లైంగిక వాంఛ తీర్చమని సదరు విద్యార్థినిని నిందితుడు బలవంత పెట్టాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలను చెట్టుకు బాది.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కీలక ఆధారాలతో పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

* పాయకాపురంలోని పునః నిర్మాణంలో ఉన్న శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయంలో ఉత్సవమూర్తి పంచలోహ విగ్రహం అపహరణ..సుమారు 18 కేజీ పంచ లోహ విగ్రహంగా గుర్తించిన పోలీసులు..సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం.
సీసీ పూటేజీ ని పరిశీలిస్తున్న పోలీసులు.

* ఇజ్రాయిల్‌లోని టెల్ అవివ్ శివారులో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఓ దుండ‌గుడు అయిదుగుర్ని కాల్చివేశాడు. గ‌డిచిన వారం రోజుల్లో ఇలాంటి దాడి జ‌ర‌గ‌డం ఇది మూడ‌వ‌సారి. బినెయి బ్రాక్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇక్క‌డే సాంప్ర‌దాయ యూదులు అధిక సంఖ్య‌లో ఉంటారు. సాయు|ధుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇటీవ‌ల ఇజ్రాయిలీ అర‌బ్‌లు అటాక్ చేయ‌డంతో సెక్యూర్టీ ద‌ళాలు హై అల‌ర్ట్‌లో ఉన్నాయి. రెండు దాడుల్లో ఆరుగురు మృతిచెందారు. న‌ల్ల దుస్తులు ధ‌రించి, చేతిలో అటోమెటిక్ వెప‌న్‌తో ఉన్న వాహ‌నంపై వ‌చ్చిన ఆ దుండ‌గుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జ‌రిపాడు. ఒక‌రు వాహ‌నంలో చ‌నిపోగా, మ‌రికొంత మంది వీధుల్లో శ‌వాల దిబ్బ‌గా మారారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌ధాని న‌ఫ్టాలీ బెన్నెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇజ్రాయిల్‌లో అర‌బ్ ఉగ్ర‌వాదం పెరిగిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. సెక్యూర్టీ ద‌ళాలు రంగంలోకి దిగాయ‌ని, ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొంటామ‌న్నారు. దాడిని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు.

*మెహిదీపట్నం టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ అడ్డంగా దొరికిపోయారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు 700 రూపాయల చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. టోలిచౌకిలో సినీ హీరో మంచు మనోజ్ ఏపీ 39HY 0319 కారులో ప్రయాణిస్తుండగా స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఆపి అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండటంతో దాన్ని తొలగించి చలాన్ విధించారు.

*బంజారాహిల్స్‌లోని కొందరు మందుబాబులు మద్యం సేవించి రోడ్డుపై వీరంగం సృష్టించారు. రోడ్డుపై అడ్డంగా కూర్చొని నానా హంగామా చేశారు. పార్క్‌హయత్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. సరైన పత్రాలు చూపించకపోవడమే కాకుండా.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలను ఆపుతూ నానా హంగామా చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి పేరుతో స్టిక్కరున్న కారును అడ్డగించి లోపల ఉన్నవారిని బయటకు దించాలంటూ పోలీసులతో వాదనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. మూడుగంటలపాటు హల్ చల్ చేసిన మందుబాబులతోపాటు మరోవైపు ఓ హిజ్రా కూడా హల్ చల్ చేయడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. రోడ్డుపై వాహనాలను ఆపుతూ గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

*గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోరీకి దుండగులు యత్నించాడు. కిటికీ పగలకొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. అయితే అలారమ్ మొగటంతో వెంటనే బ్యాంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*బాలికపై అత్యాచారం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 28న అంగడి చిట్టెంపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం హత్య చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. దీని కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 48 గంటల్లో నిందితుడిని గుర్తించామన్నారు. మహేందర్ అనే వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని, హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడన్నారు. ఇద్దరి మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఈ ప్రేమ వ్యవహారం బాలిక హత్యకు రెండు రోజుల ముందు మృతురాలి చెల్లెలకు తెలిసిందని, ఈ విషయం ఆమె ఇంట్లో చెప్పడంతో తల్లి మందలించిందన్నారు. ఇక బయట కలుసుకోవడం కుదరదని భావించి హత్యకు ముందు రోజు ఫోన్ చేసి ఇద్దరం బయట కలుద్దాం అని మాట్లాడుకున్నారని, అనుకున్న విధంగా బాలిక తెల్లవారుజాము మూడు, నాలుగు గంటల ప్రాంతంలో బయటకు వచ్చిందన్నారు. తనతో ఫిజికల్‌గా కలవాలని మహేందర్ ఆమెను బలవంత పెట్టగా.. బాలిక గట్టిగా ప్రతిఘటించిందని, దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ నేపథ్యంలో బాలికను మహేందర్ తోయడంతో ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తాకిందని, దీంతో బాలిక స్పృహ కోల్పోయిందన్నారు. అది గమనించకుండా మహేందర్ ఆమెపై హత్యాచారం చేశాడని, అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని తెలిపారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడని, ఇవాళ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా త్వరితగతిన మహేందర్‌కు శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు.

*హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న ఓ లారీ బైక్‌ను ఢీకొనడంతో.. బైక్‌పై వెళ్తున్న చిలకల్ గూడా నివాసి మహమ్మద్ ఉస్మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉస్మాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి, వాహనం నడుపుతున్నట్లు ఉస్మాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*భద్రాద్రి: జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రుని పేట ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదవుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ఆనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 19న హాస్టల్ నుండి ఇంటికి వెళ్లింది. విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఈనెల 27న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*విశాఖపట్నం: నగరంలోని నక్కపల్లి మండలం చినతీనార్ల గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది ఇల్లు దగ్ధమయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

*నలుగురు కార్మికులు ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడి మరణించిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగింది. నార్త్ ఢిల్లీలోని ప్రధాన బవానా రోడ్డులో ఉన్న సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్టు నగర్ మురుగుకాల్వలో ఎమ్‌టిఎన్‌ఎల్ లైన్‌ను బిగించడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు మురుగు కాలువలో పడిపోయారు. మురుగుకాల్వను ఇనుపవలతో కప్పడంతో దానిపై అడుగులు పెట్టిన కార్మికులు అది కూలిపోయి లోపల పడిపోయారు. మురుగుకాల్వలో పడిపోయిన ముగ్గురు కార్మికులను రక్షించడానికి సైకిల్ రిక్షా డ్రైవర్ కూడా దూకాడు.అతను కూడా బయటకు రాలేకపోయారు. మురుగుకాల్వలో పడి మరణించిన ముగ్గురు కార్మికులు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

*చీమల మందు తాగి ఓ వివాహిత మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధరాయివల స గ్రామానికి చెందిన కలిశెట్టి విజయ(28) మంగళవారం చీమలమందు తాగిం ది. కుటుంబీకులు విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. విజయకు ఇద్దరు పిల్లలు ఆడ, మగ ఉన్నారు. ఇదిలా ఉంటే గత 8 నెలల కిందట భర్త మోహనరావు అనారోగ్యంతో మృతిచెం దాడు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో చిన్నారులు అనాథలయ్యారు. అయితే విజ య చీమలమందు తాగడానికిగల కారణాలు తెలియరాలేదు. దీనిపై మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

*బాలికతో అనుచితంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై సైఫాబాద్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నవీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు, సోదరుడు చనిపోవడంతో ఓ బాలిక ఖైరతాబాద్‌లో బంధువుల వద్ద ఉంటోంది. కొద్దిరోజులుగా మనోహర్‌(27) అనే యువకుడు బాలికతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.